తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ, శని శింగనాపూర్ టూర్ - వయా వరంగల్, హైదరాబాద్, IRCTC కొత్త ప్యాకేజీ ఇదే
- IRCTC Shirdi Tour From Vijayawada : విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. అక్టోబర్ 3వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, బీదర్ స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కవచ్చు.
- IRCTC Shirdi Tour From Vijayawada : విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. అక్టోబర్ 3వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, బీదర్ స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కవచ్చు.
(1 / 6)
తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX VIJAYAWADA' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది(IRCTC)
(2 / 6)
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ అక్టోబరు 3, 2023వ తేదీన అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి మంగవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.(Unsplash.com)
(3 / 6)
మొదటి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. ఉదయం 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.(Unsplash.com)
(4 / 6)
రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.(Unsplash.com)
(5 / 6)
ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. సాయంత్రం 06.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.(Unsplash.com)
(6 / 6)
కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15,670 ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,050, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8,300చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు(Unsplash.com)
ఇతర గ్యాలరీలు