Coastal Karnataka Tour : తక్కువ ధరలో కర్ణాటక ట్రిప్ - మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే-irctc tourism operate coastal karnataka tour package from hyderabad city in this month 2024 all details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Coastal Karnataka Tour : తక్కువ ధరలో కర్ణాటక ట్రిప్ - మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Coastal Karnataka Tour : తక్కువ ధరలో కర్ణాటక ట్రిప్ - మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Sep 19, 2024, 10:07 PM IST Maheshwaram Mahendra Chary
Sep 19, 2024, 10:07 PM , IST

  • కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి…… 

కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.

(1 / 7)

కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్ 24, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 

(2 / 7)

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్ 24, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. (image source from https://unsplash.com/)

IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది.  రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. ఫస్ట్ డే హైదరాబాద్ లోని కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు. 

(3 / 7)

IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది.  రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. ఫస్ట్ డే హైదరాబాద్ లోని కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు. (image source from https://unsplash.com/)

రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.

(4 / 7)

రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.(image source from https://unsplash.com/)

4వ రోజు  Hornadu కు చేరుకుంటారు.  Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.  ఐదో రోడు మంగళూరుకు చేరుకుంటారు.  Mangala Devi ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం  Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

4వ రోజు  Hornadu కు చేరుకుంటారు.  Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.  ఐదో రోడు మంగళూరుకు చేరుకుంటారు.  Mangala Devi ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం  Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.(image source from https://unsplash.com/)

ఈ ట్రిప్ ధరలు చూస్తే…  సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 35810గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. 

(6 / 7)

ఈ ట్రిప్ ధరలు చూస్తే…  సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 35810గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. (image source from https://unsplash.com/)

హైదరాబాద్ - కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 

(7 / 7)

హైదరాబాద్ - కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 (image source from https://unsplash.com/)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు