తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Ooty Tour : 'ఊటీ వెళ్లొద్దమా'..! హైదరాబాద్ నుంచి 6 రోజుల ట్రిప్ - ప్యాకేజీ వివరాలివే
- IRCTC Ooty Tour Package : ఊటీ ట్రిప్ వెళ్తారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం అక్టోబరు 31వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలు ఇక్కడ చూద్దాం…
- IRCTC Ooty Tour Package : ఊటీ ట్రిప్ వెళ్తారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం అక్టోబరు 31వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలు ఇక్కడ చూద్దాం…
(1 / 7)
ఊటీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇప్పటికే అతి తక్కవ ధరలోనే కొత్త కొత్త ప్లేస్ లను చూపిస్తుండగా… సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. (https://unsplash.com)
(2 / 7)
ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబరు 31వ తేదీన అందుబాటులో ఉంది.(https://unsplash.com)
(3 / 7)
ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package)లో భాగంగా ఫస్ట్ డే హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది.(https://unsplash.com)
(4 / 7)
రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాల్సి ఉంటుంది.(https://unsplash.com)
(5 / 7)
మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.(https://unsplash.com)
(6 / 7)
ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.(https://unsplash.com)
(7 / 7)
ఈ ఊటీ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,920, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,460గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,370, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,920, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,910గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు