తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Ayodhya Tour : అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా..? బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
- IRCTC Ayodhya Tour Package 2024: అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్ సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ ఒక్క అయోధ్యనే కాదు.. వారణాసి, ప్రయాగరాజ్ వంటి ప్రాంతాలను కూడా దర్శించుకోవచ్చు. ఆ వివరాలను చూడండి….
- IRCTC Ayodhya Tour Package 2024: అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్ సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ ఒక్క అయోధ్యనే కాదు.. వారణాసి, ప్రయాగరాజ్ వంటి ప్రాంతాలను కూడా దర్శించుకోవచ్చు. ఆ వివరాలను చూడండి….
(1 / 6)
దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) అందుబాటు ధరలు ప్రకటిస్తోంది. మరో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు HOLY AYODHYA WITH GAYA, KASHI & PRAYAGRAJ EX BENGALURU పేరుతో సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
(2 / 6)
బెంగళూరు సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి తెలుగు ప్రయాణికులు వెళ్లాలని అనుకుంటే బెంగళూరుకు వెళ్తే… అక్కడ్నుంచి ఈ టూర్ లో భాగం కావొచ్చు. (unsplash.com/)
(4 / 6)
ఫస్ట్ డే కెంపెగౌడ ఎయిర్ పోర్టు నుంచి జర్నీ స్టార్ అవుతుంది. ఇక్కడ్నుంచి వారణాసికి బయల్దేరుతారు. గంగా హారతిలో పాల్గొంటారు. రాత్రి వారణాసిలోనే ఉంటారు.(unsplash.com/)
(5 / 6)
రెండో గయాలో, మూడో రోజు సారనాథ్ లో పర్యటిస్తారు. నాలుగో రోజు రాత్రి వరకు అయోధ్యకు చేరుకుంటారు. ఐదు రోజు అయోధ్యలోని రామయ్యను దర్శించుకుంటారు. (unsplash.com/)
(6 / 6)
ఆరో రోజు ప్రయాగరాజ్ కు వెళ్తారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు బెంగళూరుకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ అక్యుపెన్సీకి రూ. 43,350, డబుల్ అక్యుపెన్సీకి రూ. 36,850, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 35,250 ధరగా నిర్ణయించారు. ఈ ప్యాకేజీని https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.(unsplash.com/)
ఇతర గ్యాలరీలు