(1 / 6)
ఐపీఎల్ రిటెన్షన్ ఆఖరి గడువు రేపటి (అక్టోబర్ 31)తో ముగియనుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నది 10 జట్లు రేపు సాయంత్రంలోగా వెల్లడించాలి. సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఎస్‍ఆర్‌హెచ్) ఐదుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోనుందని సమాచారం.
(2 / 6)
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‍ను హైదరాబాద్ తొలి రిటైన్‍గా అట్టిపెట్టుకోనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‍లో బంపర్ హిట్టింగ్‍తో మెరుపు మెరిపించిన అతడిని ఎస్‍ఆర్‍హెచ్ రిటైన్ చేసుకోనుందని సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో 16 మ్యాచ్‍ల్లో 171 స్టైక్‍రేట్‍తో 479 రన్స్ చేసి క్లాసెన్ దుమ్మురేపాడు. అతడిని రూ.23 కోట్లు ఇచ్చి హైదరాబాద్ రిటైన్ చేసుకోనుందని అంచనా.
(3 / 6)
ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను కూడా సన్‍రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోనుంది. ఈ ఏడాది కమిన్స్ హైదరాబాద్ కెప్టెన్సీ చేపట్టగా.. జట్టు ఫైనల్‍కు చేరింది. దీంతో అతడినే కెప్టెన్‍గా కొనసాగించనుంది ఎస్‍ఆర్‌హెచ్. అతడికి రూ.18కోట్లు దక్కే అవకాశం ఉంది.
(AFP)(4 / 6)
భారత యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మను మూడో రిటెన్షన్‍గా హైదరాబాద్ ఫ్రాంచైజీ ఉంచుకోనుందని సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‍లో అభిషేక్ ధనాధన్ బ్యాటింగ్‍తో 204.22 స్ట్రైక్ రేట్‍తో 484 పరుగులతో రాణించాడు. దీంతో అతడిని రిటైన్ చేసుకునేందుకు సన్‍రైజర్స్ నిర్ణయించుకుంది.
(5 / 6)
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‍ను కూడా సన్‍రైజర్స్ రిటైన్ చేసుకోనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో హెడ్ ఏకంగా 567 పరుగులతో దుమ్మురేపాడు. అతడిని రూ.14కోట్లు ఇచ్చి హైదరాబాద్ రిటైన్ చేసుకోనుందని సమాచారం.
(6 / 6)
తెలుగు ఆల్‍రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‍రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునేందుకు రెడీ అయింది. రూ.6కోట్లు ఇచ్చి అతడిని అట్టిపెట్టుకుంటుందని సమాచారం. ఎస్ఆర్‌హెచ్ ఎవరిని రిటైన్ చేసుకుందో రేపు (అక్టోబర్ 31) సాయంత్రం అధికారికంగా వెల్లడి కానుంది.
(AP)ఇతర గ్యాలరీలు