IPL 2024: జేసన్ రాయ్ ఔట్.. మరో ఇంగ్లండ్ ఆటగాడిని తీసుకున్న కోల్‍కతా నైట్‍రైడర్స్-ipl 2024 kolkata knights riders name phil salt as replacement jason roy kkr news cricket updates ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024: జేసన్ రాయ్ ఔట్.. మరో ఇంగ్లండ్ ఆటగాడిని తీసుకున్న కోల్‍కతా నైట్‍రైడర్స్

IPL 2024: జేసన్ రాయ్ ఔట్.. మరో ఇంగ్లండ్ ఆటగాడిని తీసుకున్న కోల్‍కతా నైట్‍రైడర్స్

Mar 10, 2024, 06:14 PM IST Chatakonda Krishna Prakash
Mar 10, 2024, 06:11 PM , IST

  • IPL 2024 - KKR: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమీపిస్తోంది. ఈ తరుణంలో కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో ఓ మార్పు జరిగింది. ఐపీఎల్ 2024 సీజన్‍కు ఇంగ్లండ్ యువ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను కోల్‍కతా జట్టులోకి తీసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. ఈ తరుణంలో కోల్‍కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ మార్పు చేసింది. ఇంగ్లండ్ హిట్టర్, వికెట్ కీపింగ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. 

(1 / 5)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. ఈ తరుణంలో కోల్‍కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ మార్పు చేసింది. ఇంగ్లండ్ హిట్టర్, వికెట్ కీపింగ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. (AFP)

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్.. ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి అతడు వైదొలగడంతో కోల్‍కతాకు ఎదురుదెబ్బ తగిలింది. 

(2 / 5)

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్.. ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి అతడు వైదొలగడంతో కోల్‍కతాకు ఎదురుదెబ్బ తగిలింది. (AFP)

జేసన్ రాయ్ తప్పుకోవడంతో అతడి స్థానంలో ఇంగ్లండ్‍కే చెందిన ఫిల్ సాల్ట్‌ను కోల్‍కతా ఎంపిక చేసుకుంది.

(3 / 5)

జేసన్ రాయ్ తప్పుకోవడంతో అతడి స్థానంలో ఇంగ్లండ్‍కే చెందిన ఫిల్ సాల్ట్‌ను కోల్‍కతా ఎంపిక చేసుకుంది.(AFP)

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఓ ఏడాది ఆడిన ఫిల్ సాల్ట్.. 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో అమ్ముడుపోలేదు. అయితే, ఇప్పుడు జేసన్ రాయ్‍కు రిప్లేస్‍మెంట్‍గా కోల్‍కతాలోకి వచ్చాడు. రూ.1.5 కోట్ల ధరకు కేకేఆర్ అతడిని తీసుకున్నట్టు తెలుస్తోంది. 

(4 / 5)

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఓ ఏడాది ఆడిన ఫిల్ సాల్ట్.. 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో అమ్ముడుపోలేదు. అయితే, ఇప్పుడు జేసన్ రాయ్‍కు రిప్లేస్‍మెంట్‍గా కోల్‍కతాలోకి వచ్చాడు. రూ.1.5 కోట్ల ధరకు కేకేఆర్ అతడిని తీసుకున్నట్టు తెలుస్తోంది. (AFP)

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. మార్చి 23న కోల్‍కతా నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్‍ను ఆడనుంది. 

(5 / 5)

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. మార్చి 23న కోల్‍కతా నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్‍ను ఆడనుంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు