తెలుగు న్యూస్ / ఫోటో /
Indian Army Kite Arjun : యుద్ధభూమిలో ‘అర్జునుడు’.. శత్రువుల డ్రోన్స్‌కు వణుకు!
Indian Army Kite Arjun : సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో డ్రోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్, ఆయుధాల సరఫరా కోసం శత్రు దేశాలు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. ఇవి నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు.. భారత సైన్యం సిద్ధమైంది. గద్దలకు శిక్షణ ఇచ్చి.. వాటి ద్వారా డ్రోన్స్‌ను నేలకూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
(1 / 5)
భారత సైన్యం.. చరిత్రలోనే తొలిసారిగా గద్దలకు ట్రైనింగ్ ఇస్తోంది. సరిహద్దుల్లో నుంచి వస్తున్న డ్రోన్స్‌ను పసిగట్టి, వాటిని ధ్వంసం చేసే విధంగా ఈ గద్దలు శిక్షణ పొందుతున్నాయి.(PTI)
(2 / 5)
ఇటీవలే జరిగిన ఇండియా యూఎస్ వార్ గేమ్‌లో ఈ గద్దలను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియన్ ఆర్మీ. అర్జున్ అనే పేరుతో ఉన్న గద్దను పరిచయం చేసింది.(PTI Photo/Arun Sharma)
(3 / 5)
విన్యాసాల్లో భాగంగా.. గద్దను, శునకాన్ని పరీక్షించింది భారత సైన్యం. శత్రు దేశం నుంచి ఓ డ్రోన్ వస్తున్నట్టు చిత్రీకరించింది. ఆ శునకం.. ఆ డ్రోన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తుపట్టి సైన్యాన్ని అలర్ట్ చేసింది. రంగంలోకి దిగిన గద్ద.. ఆ ప్రాంతానికి వెళ్లి గాలిలోనే డ్రోన్‌ను కూల్చివేసింది.(PTI)
(4 / 5)
పంజాబ్, జమ్ముకశ్మీర్ సరిహద్దులో ఇటీవలి కాలంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్‌తో పాటు ఆయుధాలను సరిహద్దులోకి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళుతున్నాయి. ఈ డ్రోన్స్‌కు చెక్ పెట్టేందుకు.. ఈ గద్దలు ఉపయోగపడతాయని సైన్యం భావిస్తోంది.(PTI)
ఇతర గ్యాలరీలు