(1 / 9)
India vs Bangladesh Live: తొలి రోజు టీమిండియా పైచేయి సాధించిందంటే దానికి కారణం రవిచంద్రన్ అశ్విన్ సెంచరీయే. తన సొంత మైదానం చెపాక్ లో అతడు టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 112 బంతుల్లో 102 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
(AP)(2 / 9)
India vs Bangladesh Live: చెపాక్ లో అశ్విన్ బంతితో చెలరేగుతాడనుకుంటే.. తొలి రోజే బ్యాట్ తో టీమ్ ను ఆదుకున్నాడు. టాప్, మిడిలార్డర్ లోని బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ సెంచరీతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లను సులువుగా ఎదుర్కొంటూ అతడు సెంచరీ చేశాడు.
(PTI)(3 / 9)
India vs Bangladesh Live: బంగ్లాదేశ్ పేస్ బౌలర్ హసన్ మహమూద్ టీమిండియా టాప్, మిడిలార్డర్ ను వణికించాడు. తన పేస్ తో 4 వికెట్లు తీసిన అతడు.. ఒక దశలో బంగ్లాదేశ్ పైచేయి సాధించేలా చేశాడు.
(AFP)(4 / 9)
India vs Bangladesh Live: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్, శుభ్‌మన్, విరాట్ లాంటి వాళ్లు వరుసగా పెవిలియన్ చేరిన సమయంలో ఎంతో ఓపిగ్గా ఆడిన అతడు.. 59 పరుగులు చేశాడు.
(PTI)(5 / 9)
India vs Bangladesh Live: అశ్విన్ కు అతని స్పిన్ బౌలింగ్ పార్ట్‌నర్ రవీంద్ర జడేజా మంచి సహకారం అందించాడు. జడ్డూ కూడా తొలి రోజు 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో రోజు సెంచరీపై కన్నేశాడు. అతడు ఇప్పటికే అశ్విన్ తో కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగులు జోడించడం విశేషం.
(AFP)(6 / 9)
India vs Bangladesh Live: టెస్టుల్లో జడేజా తన 21వ హాఫ్ సెంచరీ చేశాడు. మరోసారి టీమిండియాకు బ్యాట్ తో ఆపద్భాందవుడిగా నిలిచాడు.
(PTI)(7 / 9)
India vs Bangladesh Live: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు చెత్త ఆరంభం లభించింది. బంగ్లా పేస్ బౌలర్ హసన్ ధాటికి ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (6), శుభ్‌మన్ గిల్ (0), విరాట్ కోహ్లి (6) దారుణంగా విఫలమయ్యారు.
(PTI)(8 / 9)
India vs Bangladesh Live: బంగ్లాదేశ్ పేస్ బౌలర్ హసన్ మహమూద్ తన టాప్ ఫామ్ ను కొనసాగించాడు. అతడు నిప్పులు చెరిగే పేస్ తో టాప్ ఇండియన్ బ్యాటర్లను వణికించాడు. 18 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
(PTI)(9 / 9)
India vs Bangladesh Live: సుమారు 700 రోజుల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా 39 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు యశస్వితో కలిసి 4వ వికెట్ కు 62 పరుగులు జోడించాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ (16) మాత్రం నిరాశపరిచాడు.
(AFP)ఇతర గ్యాలరీలు