Independence Day 2024 : ఈ జలాశయం చూసేందుకు భారతదేశ పటంలా కనిపిస్తుంది.. ఎక్కడ ఉందో తెలుసా?
- Independence Day 2024 : ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనేందుకు భారతదేశం రెడీ అయింది. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలి. ఓ జలాశయం చూసేందుకు భారతదేశ పటాన్ని పోలి ఉంటుంది. అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

(1 / 6)
ఒక్కసారిగా చూడగానే ఇది భారతదేశ పటంలా కనిపిస్తుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఈ జలాశయం భారతదేశ పటంలా అగుపిస్తుంది.
(3 / 6)
1898 నుండి 1907 వరకు వాణి విలాస్ సాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును వి.వి.పుర గ్రామం సమీపంలో నిర్మించారు. వేదవతి నదిపై మైసూరు రాజ్యం రాజు నల్వాడి కృష్ణరాజ వడయార్ తల్లి కెంప నంజమణి వాణి విలాస్ పేరిట ఈ జలాశయం ఉంది.
(4 / 6)
చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ తాలూకా పూర్తిగా బంజరుగా ఉండేది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం సాగునీరు అందించడం. చిత్రదుర్గ, తుమకూరులోని కొన్ని ప్రాంతాలకు ఈ జలాశయం నుండి నీటిని విడుదల చేస్తారు.
(5 / 6)
1907లో వి.వి.సాగర్ రిజర్వాయర్ నిర్మించిన తర్వాత తొలిసారిగా 1933లో గరిష్ట నీటిమట్టం 130 అడుగులకు చేరుకోగా 30 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవలి కాలంలో 2000లో అత్యధికంగా 22.00 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. మిగిలిన పదేళ్లలో (2019-20కి ముందు) వర్షాలు సరిగా కురవకపోవడంతో డ్యాంలో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది.
ఇతర గ్యాలరీలు