తెలుగు న్యూస్ / ఫోటో /
IND vs BAN: సెమీస్‍లో బంగ్లాదేశ్‍ను చిత్తుచేసిన టీమిండియా.. ఆసియాకప్ ఫైనల్‍కు దూసుకెళ్లిన హర్మన్‍సేన
- IND vs BAN Women Asia Cup 2024: మహిళల ఆసియాకప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరింది. నేడు (జూలై 26) సెమీస్‍లో బంగ్లాదేశ్‍ను చిత్తుగా ఓడించింది భారత్.
- IND vs BAN Women Asia Cup 2024: మహిళల ఆసియాకప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరింది. నేడు (జూలై 26) సెమీస్‍లో బంగ్లాదేశ్‍ను చిత్తుగా ఓడించింది భారత్.
(1 / 5)
మహిళల ఆసియాకప్ టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. దంబుల్లా వేదికగా నేడు (జూలై 26) జరిగిన సెమీఫైనల్‍లో భారత్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై ఘన విజయం సాధించింది. (BCCI)
(2 / 5)
తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసి బంగ్లాదేశ్‍ను చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. ముందుగా బౌలింగ్‍లో అదరగొట్టి.. ఆ తర్వాత బ్యాటింగ్‍లో రెచ్చిపోయింది హర్మన్‍ప్రీత్ సారథ్యంలోని టీమిండియా.
(3 / 5)
ఈ సెమీస్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 80 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (32) మినహా మిగిలిన వారెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ తలా మూడు వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
(4 / 5)
స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు ఊదేశారు. స్మృతి మంధాన (39 బంతుల్లో 55 పరుగులు; 9 ఫోర్లు, ఓ సిక్స్) ధనాధన్ అర్ధ శతకం చేయగా.. షెఫాలీ వర్మ (28 బంతుల్లో 26 పరుగులు) నిలకడగా ఆడారు. దీంతో ఒక్క వికెట్ కోల్పోకుండానే 11 ఓవర్లలో 83 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది.
ఇతర గ్యాలరీలు