IND vs BAN 1st T20: టీమిండియాలో అరంగేట్రం చేసిన తెలుగు ప్లేయర్.. మరో పేసర్ కూడా.. టాస్ గెలిచిన భారత్-ind vs ban 1st t20 nitish kumar reddy and mayank yadav debuts for india and suryakumar won the against bangladesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Ban 1st T20: టీమిండియాలో అరంగేట్రం చేసిన తెలుగు ప్లేయర్.. మరో పేసర్ కూడా.. టాస్ గెలిచిన భారత్

IND vs BAN 1st T20: టీమిండియాలో అరంగేట్రం చేసిన తెలుగు ప్లేయర్.. మరో పేసర్ కూడా.. టాస్ గెలిచిన భారత్

Oct 06, 2024, 07:10 PM IST Chatakonda Krishna Prakash
Oct 06, 2024, 07:05 PM , IST

  • IND vs BAN 1st T20: బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో భారత్ టాస్ గెలిచింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాలో అరంగేట్రం చేశాడు తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి. మరో యంగ్ పేసర్ కూడా డెబ్యూ చేశాడు. మరిన్ని వివరాలివే..

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ పోరు మొదలైంది. తొలి టీ20 నేడు (అక్టోబర్ 6) గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. 

(1 / 6)

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ పోరు మొదలైంది. తొలి టీ20 నేడు (అక్టోబర్ 6) గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. (AFP)

యంగ్ ఆల్‍రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్‍తో ఈ మ్యాచ్‍తో అంతర్జాతీయ క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు. తొలిసారి భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున హిట్టింగ్‍తో మెరుపులు మెరిపించిన నితీశ్‍.. ఇప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేశాడు. 

(2 / 6)

యంగ్ ఆల్‍రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్‍తో ఈ మ్యాచ్‍తో అంతర్జాతీయ క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు. తొలిసారి భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున హిట్టింగ్‍తో మెరుపులు మెరిపించిన నితీశ్‍.. ఇప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేశాడు. (PTI)

ఈ ఏడాది ఐపీఎల్‍లో 142.92 స్ట్రైక్‍రేట్‍తో 303 పరుగులతో రెచ్చిపోయాడు నితీశ్. కీలకమైన సమయాల్లో హిట్టింగ్ చేసి సత్తాచాటాడు. బౌలింగ్‍లోనూ పర్వాలేదనిపించాడు.  టీమిండియాలోనూ అదరగొట్టాలని కసితో ఉన్నాడు నితీశ్.

(3 / 6)

ఈ ఏడాది ఐపీఎల్‍లో 142.92 స్ట్రైక్‍రేట్‍తో 303 పరుగులతో రెచ్చిపోయాడు నితీశ్. కీలకమైన సమయాల్లో హిట్టింగ్ చేసి సత్తాచాటాడు. బౌలింగ్‍లోనూ పర్వాలేదనిపించాడు.  టీమిండియాలోనూ అదరగొట్టాలని కసితో ఉన్నాడు నితీశ్.(AFP)

యంగ్ సెన్సేషనల్ పేసర్ మయాంక్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‍తో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఆడిన మయాంక్ యాదవ్.. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను అలవోకగా సంధించాడు. మెరుపు బౌలింగ్‍తో భారత జట్టులోనూ రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. 

(4 / 6)

యంగ్ సెన్సేషనల్ పేసర్ మయాంక్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‍తో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఆడిన మయాంక్ యాదవ్.. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను అలవోకగా సంధించాడు. మెరుపు బౌలింగ్‍తో భారత జట్టులోనూ రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. (PTI)

బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో భారత తుది జట్టులో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు ప్లేస్ దక్కలేదు. రవి బిష్ణోయ్ కూడా బెంచ్‍పై పరిమితం అయ్యాడు. తొలి టీ20లో భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్

(5 / 6)

బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో భారత తుది జట్టులో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు ప్లేస్ దక్కలేదు. రవి బిష్ణోయ్ కూడా బెంచ్‍పై పరిమితం అయ్యాడు. తొలి టీ20లో భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్(PTI)

బంగ్లాదేశ్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్ తుది జట్టు: లిటన్ దాస్(వికెట్ కీపర్), పర్వేజ్ హుసేన్ ఎమోన్, నజ్ముల్ హుసేన్ శాంతో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కిన్ అహమ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, షరీఫుల్ ఇస్లాం

(6 / 6)

బంగ్లాదేశ్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్ తుది జట్టు: లిటన్ దాస్(వికెట్ కీపర్), పర్వేజ్ హుసేన్ ఎమోన్, నజ్ముల్ హుసేన్ శాంతో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కిన్ అహమ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, షరీఫుల్ ఇస్లాం(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు