ICC Cricket World Cup 2023: అప్పుడు సెహ్వాగ్, కోహ్లి.. ఇప్పుడు కాన్వే, రచిన్.. ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండ్‌దేనా?-icc cricket world cup 2023 then sehwag and kohli now conway and rachin can new zealand repeat history ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Icc Cricket World Cup 2023: అప్పుడు సెహ్వాగ్, కోహ్లి.. ఇప్పుడు కాన్వే, రచిన్.. ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండ్‌దేనా?

ICC Cricket World Cup 2023: అప్పుడు సెహ్వాగ్, కోహ్లి.. ఇప్పుడు కాన్వే, రచిన్.. ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండ్‌దేనా?

Oct 06, 2023, 10:19 AM IST Hari Prasad S
Oct 06, 2023, 10:19 AM , IST

  • ICC Cricket World Cup 2023: అప్పుడు సెహ్వాగ్, కోహ్లి.. ఇప్పుడు కాన్వే, రచిన్.. ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండ్‌దేనా? వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేసిన తర్వాత ఆ టీమ్ ట్రోఫీ గెలిచిన సందర్భం చివరిసారి 2011లో నమోదైంది. అప్పుడు ఇండియానే కప్పు గెలిచింది.

ICC Cricket World Cup 2023: వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్ లో 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 36.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించింది.

(1 / 5)

ICC Cricket World Cup 2023: వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్ లో 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 36.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించింది.(AP)

ICC Cricket World Cup 2023: ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. కాన్వే 121 బంతుల్లో 152, రచిన్ 96 బంతుల్లో 123 రన్స్ చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 273 రన్స్ జోడించారు.

(2 / 5)

ICC Cricket World Cup 2023: ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. కాన్వే 121 బంతుల్లో 152, రచిన్ 96 బంతుల్లో 123 రన్స్ చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 273 రన్స్ జోడించారు.(AFP)

ICC Cricket World Cup 2023: తొలి మ్యాచ్ లోనే ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు సెంచరీలు చేయడంతో ఈసారి కప్పు ఆ టీమే గెలుస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీని వెనుక ఓ సెంటిమెంట్ దాగి ఉంది.

(3 / 5)

ICC Cricket World Cup 2023: తొలి మ్యాచ్ లోనే ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు సెంచరీలు చేయడంతో ఈసారి కప్పు ఆ టీమే గెలుస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీని వెనుక ఓ సెంటిమెంట్ దాగి ఉంది.(AFP)

ICC Cricket World Cup 2023: చివరిసారి 2011 వరల్డ్ కప్ లో ఇలా తొలి మ్యాచ్ లోనే ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఆ తర్వాత ఆ టీమే వరల్డ్ కప్ గెలిచింది. ఆ టీమ్ మరేదో కాదు ఇండియానే. ఆ బ్యాటర్లు సెహ్వాగ్, విరాట్ కోహ్లి. బంగ్లాదేశ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో సెహ్వాగ్ 175, కోహ్లి 100 రన్స్ చేశారు.

(4 / 5)

ICC Cricket World Cup 2023: సెహ్వాగ్, కోహ్లి సెంచరీలతో ఇండియా ఏకంగా 370 రన్స్ చేయగా.. తర్వాత బంగ్లాదేశ్ 283 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ గెలిచిన టీమిండియా.. తర్వాత 2011 వరల్డ్ కప్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ బ్యాటర్లు కాన్వే, రచిన్ సెంచరీలు చేయడంతో ఈసారి ట్రోఫీ కివీస్ సొంతమవుతుందా అన్న అంచనాలు ఏర్పడ్డాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు