2023 Kia Seltos: కియా సెల్టోస్.. ఇప్పుడు మరింత సేఫ్.. న్యూ ఇంజన్, సరికొత్త ఫీచర్స్ తో 2023 మోడల్
- దక్షిణ కొరియా సంస్థ కియా (Kia) నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్యూవీ మోడల్ సెల్టోస్ (Seltos). తాజాగా, 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ ను కియా భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో ఇంజన్ లో మార్పు, కొత్త ఫీచర్స్, ఏడీఏఎస్ లతో మరింత సేఫ్ గా తీర్చిదిద్దింది. ఆ వివరాలు..
- దక్షిణ కొరియా సంస్థ కియా (Kia) నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్యూవీ మోడల్ సెల్టోస్ (Seltos). తాజాగా, 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ ను కియా భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో ఇంజన్ లో మార్పు, కొత్త ఫీచర్స్, ఏడీఏఎస్ లతో మరింత సేఫ్ గా తీర్చిదిద్దింది. ఆ వివరాలు..
(1 / 10)
2023 కియా సెల్టోస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో ఎక్స్టీరియర్స్ లో స్వల్ప మార్పులతో పాటు కొత్త పెట్రోలు ఇంజన్ ను అమర్చారు. ఈ కార్ బుకింగ్స్ జులై 14 నుంచి ప్రారంభమవుతున్నాయి.
(2 / 10)
ఈ 2023 వర్షన్ సెల్టోస్ లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న 1.4 టర్బో పెట్రోలు ఇంజన్ స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు.
(3 / 10)
ఈ కొత్త 2023 సెల్టోస్ ఇప్పుడు కొత్తగా ప్యూటర్ ఆలివ్ ( Pewter Olive) కలర్ లో కూడా లభిస్తుంది. ఈ కొత్త మోడల్ లో బంపర్స్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కూడా స్వల్పంగా మార్చారు.
(4 / 10)
2023 సెల్టోస్ లో అడ్వాన్సడ్ డ్రైవర్ ఎయిడ్స్ సిస్టమ్ (ADAS) ను అమర్చారు. ఈ ఏడీఏఎస్ కోసం ప్రత్యేకంగా మూడు రాడార్లను, ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఏడీఏఎస్ లో ప్రత్యేకంగా ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిజన్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి.
(5 / 10)
ఈ సరికొత్త 2023 కియా సెల్టోస్ లో 17 ఇంచ్ ల అలాయ్ వీల్స్ ఉంటాయి. కస్టమర్ కోరుకుంటే ప్రత్యేకంగా 10 ఇంచ్ క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ అలాయి వీల్స్ ను ఏర్పాటు చేస్తారు.
(6 / 10)
కియా సెల్టోస్ లో 15 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. వాటిల 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్.. వంటివి ఉన్నాయి.
(7 / 10)
న్యూ కియా సెల్టోస్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్ ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. బంపర్ డిజైన్ లో కూడా మార్పులు చేశారు.
(8 / 10)
కొత్త సెల్టోస్ ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెరల్, క్లీయర్ వైట్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేషియర్ వైట్ పెరల్, గ్రావిటీ గ్రే.. తదితర కలర్స్ లో లభిస్తుంది.
(9 / 10)
క్యాబిన్ లో ట్విన్ స్క్రీన్ లే ఔట్ డిజైన్ ఉంటుంది. ఫుల్ గా డిజిటల్ డిస్ ప్లేతో రెండు కూడా 10.25ఇంచ్ ల స్క్రీన్ సైజ్ తో ఉంటాయి.
ఇతర గ్యాలరీలు