Hyderabad Wine Shops Close : రేపు, ఎల్లుండి వైన్ షాపులు బంద్- స్టాక్ కోసం క్యూ కట్టిన మందుబాబులు-hyderabad wine shops remain closed on sep 17th 18th due to ganesh nimajjanam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Wine Shops Close : రేపు, ఎల్లుండి వైన్ షాపులు బంద్- స్టాక్ కోసం క్యూ కట్టిన మందుబాబులు

Hyderabad Wine Shops Close : రేపు, ఎల్లుండి వైన్ షాపులు బంద్- స్టాక్ కోసం క్యూ కట్టిన మందుబాబులు

Published Sep 16, 2024 03:11 PM IST Bandaru Satyaprasad
Published Sep 16, 2024 03:11 PM IST

  • Hyderabad Wine Shops Close : హైదరాబాద్ లోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రెండ్రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ లోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.  రెండ్రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

(1 / 6)

రేపు(మంగళవారం) హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు.  నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

(2 / 6)

సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు మూసేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

(3 / 6)

ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు, బార్లు తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం నిబంధనలు వర్తించవని పోలీసులు పేర్కొన్నారు.  

(4 / 6)

రానున్న రెండ్రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానుండడంతో...ఇవాళ నగరంలోని పలు మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీ కనిపిస్తుంది. గణేష్ నిమజ్జనం అంటే మందు, చిందు తప్పనిసరి అని భావించే మందుబాబులు ముందు జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుంటున్నారు. 

(5 / 6)

హైదరబాద్ లో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శోభయాత్ర రూట్ ఖరారు చేశారు. సున్నితమైన ప్రదేశాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు