Mercer Ranking : భారతదేశంలో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్, వరుసగా ఆరోసారి-hyderabad news in telugu mercer city ranking hyderabad best indian city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mercer Ranking : భారతదేశంలో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్, వరుసగా ఆరోసారి

Mercer Ranking : భారతదేశంలో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్, వరుసగా ఆరోసారి

Dec 14, 2023, 06:50 PM IST Bandaru Satyaprasad
Dec 14, 2023, 06:49 PM , IST

  • Mercer Ranking : మెర్సర్స్ 2023 క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌ నగరం అగ్రస్థానంలో నిలించింది. నివసించడానికి ఉత్తమ భారతీయ నగరాలు ఇలా ఉన్నాయి.

మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ (సిటీ ర్యాంకింగ్) సర్వే 2023 ప్రకారం వరుసగా ఆరోసారి హైదరాబాద్ నివసించడానికి అత్యుత్తమ భారతీయ నగరంగా నిలిచింది. ఈ నగరం గ్లోబల్ లిస్ట్‌లో 153వ స్థానంలో ఉంది. . రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక-ఆర్థిక వాతావరణం, జీవన వ్యయం పెరామీటర్స్ లో అగ్రస్థానంలో ఉంది. 

(1 / 7)

భారతదేశంలోని ఇతర అత్యుత్తమ నగరాల్లో పూణే 154వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 156వ స్థానంలో, చెన్నై 161, ముంబై 164, కోల్‌కతా 170, న్యూఢిల్లీ 172 స్థానంలో ఉంది (ఫోటో :బ్లూమ్‌బెర్గ్)

(2 / 7)

ప్రపంచవ్యాప్తంగా వియన్నా (ఆస్ట్రియా) అగ్రస్థానంలో ఉండగా, జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), వాంకోవర్ (కెనడా) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. (ఫైల్ ఫోటో) 

(3 / 7)

మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే 2023 జీవన నాణ్యతను అంచనా వేస్తుంది. వాతావరణం, పాఠశాలలు, విద్య, వైద్యం, పారిశుద్ధ్య ప్రమాణాలు, హింస, నేరాలు, కమ్యూనికేషన్‌ల సౌలభ్యం, సామాజిక-రాజకీయ వాతావరణం వంటి అంశాలపై ఈ సూచిక ఆధారపడి ఉంటుంది. (HT ఫైల్ ఫోటో)

(4 / 7)

మెర్సర్ డేటా ప్రకారం, అధిక నాణ్యత గల జీవనం ఉన్న దేశాలు తమ పౌరులకు, ప్రవాసులకు అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక సేవలతో పాటు సరసమైన గృహాలను అందిస్తాయి. ప్రస్తుత గ్లోబల్ ల్యాండ్‌స్కేప్ భౌగోళిక రాజకీయ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇవన్నీ నగరాలలో జీవన ప్రమాణాలపై ప్రభావాలు చూపిస్తున్నాయి. చాలా మంది నివసించే, పనిచేసే ప్రదేశాలలో వారికి, వారి కుటుంబాలకు లభించే జీవన నాణ్యతను అంచనా వేస్తున్నారు.( ఫోటో : పిక్సాబే) 

(5 / 7)

అంతర్జాతీయ ఉద్యోగుల కోసం 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్‌లో ముంబయి అత్యంత ఖరీదైన భారతీయ నగరంగా అవతరించింది. ఇది ప్రస్తుతం 127వ స్థానంలో ఉంది. న్యూ ఢిల్లీ 155, చెన్నై 177, బెంగళూరు 178, హైదరాబాద్ 192, పూణే 201 స్థానంలో ఉన్నాయి. (HT ఫోటో)

(6 / 7)

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనే సూచిక ఉంది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిని స్థిరత్వాన్ని అందిస్తూ భారతదేశంలో పట్టణాల్లో జీవన ప్రమాణాల నాణ్యతను మెరుగుపరిచే పద్ధతులను రూపొందిస్తుంది. (ఫైల్ ఫోటో)

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు