Smita Sabharwal : వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్, ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన దివ్యాంగులు-hyderabad ias smita sabharwal controversial tweet on divyangjan complaint to nhrc ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smita Sabharwal : వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్, ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన దివ్యాంగులు

Smita Sabharwal : వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్, ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన దివ్యాంగులు

Jul 22, 2024, 07:59 PM IST Bandaru Satyaprasad
Jul 22, 2024, 07:59 PM , IST

  • Smita Sabharwal : ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించిన తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడంలేదు. దీంతో ఆమెపై దివ్యాంగులు ఎన్హెచ్ఆర్సీ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు.  

ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించిన తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడంలేదు. దీంతో ఆమెపై దివ్యాంగులు ఎన్హెచ్ఆర్సీ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తన వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ స్పందించారు. 

(1 / 6)

ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించిన తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడంలేదు. దీంతో ఆమెపై దివ్యాంగులు ఎన్హెచ్ఆర్సీ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తన వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ స్పందించారు. ( Smita Sabharwal's twitter )

ట్విట్టర్ లో స్పందించిన స్మితా సబర్వాల్... నా టైమ్‌లైన్‌పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్న వాస్తవమైన విషయం గురించి బహిరంగంగా మాట్లాడితే స్పందన ఇలానే ఉంటుందన్నారు.  IPS/ IFoS, డిఫెన్స్ రంగాల్లో దివ్యాంగ కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయడంలేదో పరిశీలించాలని హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానన్నారు. 

(2 / 6)

ట్విట్టర్ లో స్పందించిన స్మితా సబర్వాల్... నా టైమ్‌లైన్‌పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్న వాస్తవమైన విషయం గురించి బహిరంగంగా మాట్లాడితే స్పందన ఇలానే ఉంటుందన్నారు.  IPS/ IFoS, డిఫెన్స్ రంగాల్లో దివ్యాంగ కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయడంలేదో పరిశీలించాలని హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానన్నారు. ( Smita Sabharwal's twitter )

ఐఏఎస్ ల విషయంలోనూ దివ్యాంగ కోటా అమలుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని స్మితా సబర్వాల్ అన్నారు. నెటిజన్ల విమర్శలకు కౌంటర్ ఇస్తూ సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదన్నారు.  

(3 / 6)

ఐఏఎస్ ల విషయంలోనూ దివ్యాంగ కోటా అమలుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని స్మితా సబర్వాల్ అన్నారు. నెటిజన్ల విమర్శలకు కౌంటర్ ఇస్తూ సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదన్నారు.  ( Smita Sabharwal's twitter )

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో దివ్యాంగ కోటాపై చర్చ మొదలైంది. ఈ విషయంపై స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్... దివ్యాంగులను పైలట్‌గా ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా? అని వివాదాస్పద ట్వీట్ చేశారు.  ఆల్ ఇండియా సర్వీసులు(IAS/IPS/IFoS)  ఫీల్డ్ వర్క్, ఎక్కువ సమయం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గడపాలి, దీనికి శారీరక దృఢత్వం అవసరం అన్నారు.  ఈ సర్వీసులకు దివ్యాంగ కోటా ఎందుకు అవసరం అని ప్రశ్నించారు. 

(4 / 6)

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో దివ్యాంగ కోటాపై చర్చ మొదలైంది. ఈ విషయంపై స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్... దివ్యాంగులను పైలట్‌గా ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా? అని వివాదాస్పద ట్వీట్ చేశారు.  ఆల్ ఇండియా సర్వీసులు(IAS/IPS/IFoS)  ఫీల్డ్ వర్క్, ఎక్కువ సమయం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గడపాలి, దీనికి శారీరక దృఢత్వం అవసరం అన్నారు.  ఈ సర్వీసులకు దివ్యాంగ కోటా ఎందుకు అవసరం అని ప్రశ్నించారు. ( Smita Sabharwal's twitter )

స్మితా సబర్వాల్ ట్వీట్ పై దివ్యాంగులు మండిపడుతున్నారు. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేశారని, స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా స్మితా సబర్వాల్ పై ఫిర్యాదు చేశారు కొందరు దివ్యాంగులు. 

(5 / 6)

స్మితా సబర్వాల్ ట్వీట్ పై దివ్యాంగులు మండిపడుతున్నారు. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేశారని, స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా స్మితా సబర్వాల్ పై ఫిర్యాదు చేశారు కొందరు దివ్యాంగులు. ( Smita Sabharwal's twitter )

స్మితా సబర్వాల్ కామెంట్స్ పై ఐఏఎస్ అకాడమీ నిర్వాహకులు బాలలత ఘాటుగా స్పందించారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మితా సబర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.  ఆమెపై కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.  ఇద్దరం సివిల్స్ పరీక్ష రాద్దామని, తన కన్నా ఎక్కువ మార్కులు సాధించమని స్మితా సబర్వాల్ కు సవాల్ విసిరారు.  కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి ఆమె కనీసం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారం అన్నారు.  24 గంటల్లో స్మితా సబర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోతే ట్యాంక్ బండ్ పైన నిరసన దీక్ష చేపడతామన్నారు.  

(6 / 6)

స్మితా సబర్వాల్ కామెంట్స్ పై ఐఏఎస్ అకాడమీ నిర్వాహకులు బాలలత ఘాటుగా స్పందించారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మితా సబర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.  ఆమెపై కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.  ఇద్దరం సివిల్స్ పరీక్ష రాద్దామని, తన కన్నా ఎక్కువ మార్కులు సాధించమని స్మితా సబర్వాల్ కు సవాల్ విసిరారు.  కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి ఆమె కనీసం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారం అన్నారు.  24 గంటల్లో స్మితా సబర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోతే ట్యాంక్ బండ్ పైన నిరసన దీక్ష చేపడతామన్నారు.  

WhatsApp channel

ఇతర గ్యాలరీలు