తెలుగు న్యూస్ / ఫోటో /
New Voter Registration 2024 : మీకు ఓటు హక్కు లేదా..? ఈ లింక్ తో కొత్తగా దరఖాస్తు చేసుకోండి
- New Voter Registration For General Elections 2024 : త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం కీలక అప్డేట్ ఇచ్చింది. ఓటు హక్కు లేని వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి….
- New Voter Registration For General Elections 2024 : త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం కీలక అప్డేట్ ఇచ్చింది. ఓటు హక్కు లేని వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి….
(1 / 5)
త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోనూ 17 పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓటరు కార్డు లేని వారి కోసం తెలంగాణ ఎన్నికల సంఘం కీలక అలర్ట్ ఇచ్చింది.
(2 / 5)
ఓటరు కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలంటే… https://voters.eci.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
(3 / 5)
New registration for general electors అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీన్ని ఫారమ్ 6 అని అంటారు. దీనిపై క్లిక్ చేస్తే మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది.
(4 / 5)
మొదటగా మీరు మొబైల్ నెంబర్ లేదా మెయిల్ లేదా రిజిస్ట్రర్ కావాలి. లాగిన్ వివరాలను జనరేట్ అయిన తర్వాత….మీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
(5 / 5)
ఇప్పుడు పుట్టిన తేదీ, చిరునామా, పుట్టిన తేదీ సర్టిఫికేట్ తదితర వివరాలను అందించాలి. మీ నియోజకవర్గం వివరాలను సరిగా ఇవ్వాలి. కొత్త ఓటరు కార్డు దరఖాస్తు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. డిజిటల్ ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా మీరు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ http://voters. eci.gov.in లాగిన్ చేయాలి. తగిన వివరాలను ఇక్కడ ఇవ్వాలి ఉంటుంది.ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.అదే పోలింగ్ కేంద్రంలో పేరు ఉన్నట్లయితే గుర్తింపు కార్డును చూపి ఓటేయవచ్చు. లేదంటే ఈ పద్ధతుల్లో ఓటర్ స్లిప్‌ను లేదా వివరాలను పొందే వెసులుబాటు ఉంది.
ఇతర గ్యాలరీలు