తెలుగు న్యూస్ / ఫోటో /
Holding in a Sneeze: తుమ్మును అడ్డుకుంటున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా?
- Holding in a Sneeze: చాలా మంది తుమ్ము వచ్చేటపుడు ముక్కుకు, నోటికి తమ చేతిని లేదా రుమాలును అడ్డుపెట్టుకుంటారు లేదా ఆపుకుంటారు. దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకోండి.
- Holding in a Sneeze: చాలా మంది తుమ్ము వచ్చేటపుడు ముక్కుకు, నోటికి తమ చేతిని లేదా రుమాలును అడ్డుపెట్టుకుంటారు లేదా ఆపుకుంటారు. దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకోండి.
(1 / 6)
తుమ్మేటప్పుడు చేతిని అడ్డం పెట్టుకుంటున్నారా? లేదా నమ్మకాలతో తుమ్మును ఆపుకుంటున్నారా? ఇలా చేయడం వలన మీకు శారీరకంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు.
(2 / 6)
చాలా మంది తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు. గాలి బయటకు రాని విధంగా అడ్డుకుంటారు. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదకరం అని పరిశోధకుల అభిప్రాయపడుతున్నారు.
(3 / 6)
సైంటిస్టులు ప్రకారం, తుమ్ము వేగంగా వస్తుంది, దాని శబ్దం అధిక వేగంతో బయటకు వచ్చి గాలిలో కలిసిపోతుంది. ఆ వేగం గంటకు 100 మైళ్ల నుండి గరిష్టంగా గంటకు 500 మైళ్ల వరకు ఉంటుంది. ఇంతటి ఒత్తిడిని బయటకు కాకుండా శరీరం లోపల మింగడానికి బలవంతం చేయడం వల్ల లోపల చాలా నష్టం జరుగుతుంది.
(4 / 6)
ఎలాంటి నష్టం జరుగుతుందంటే? స్వరపేటికకు పగుళ్లు రావచ్చు, వెన్నునొప్పి రావచ్చు, ముఖ నరం గాయపడవచ్చు. ఇది ఇక్కడితో ముగియదు. చెవిపోటుకు కారణం కావచ్చు, చెవుడు వచ్చే ప్రమాదం ఉంది..
(5 / 6)
తుమ్ము ఒత్తిడి శరీరం లోపలికి వెళితే పక్కటెముకలను నలిపేస్తుంది. ఆ ఒత్తిడి శరీరంలోకి బలంగా వెళ్తే, అది మెదడు, శరీరంలోని వివిధ భాగాలలో క్రమరహిత తరంగాలను సృష్టిస్తుంది. ఆ తరంగాల తాకిడి శరీరానికి చాలా నష్టం కలిగిస్తుంది.
ఇతర గ్యాలరీలు