Diabetes - Ayurvedic Remedies । షుగర్ వ్యాధికి ఆయుర్వేదంతో చెక్ పెట్టండి, ఇవిగో మూలికలు!
- Ayurvedic Remedies for Diabetes: మధుమేహంను సహజంగా తగ్గించే అనేక ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. అవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆ నివారణలు ఏమిటో ఇక్కడ చూడండి.
- Ayurvedic Remedies for Diabetes: మధుమేహంను సహజంగా తగ్గించే అనేక ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. అవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆ నివారణలు ఏమిటో ఇక్కడ చూడండి.
(1 / 6)
మధుమేహం ఒక దీర్ఘకాలిక సమస్య, దీని కారణంగా గుండె జబ్బుల ముప్పు కూడా అధికంగా ఉంటుంది. ఆయుర్వేద నివారణ మార్గాలతో దీని నుంచి బయటపడవచ్చు. (Unsplash)
(2 / 6)
పునర్నవ: పునర్నవ అనే మూలిక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, రెండు నుండి ఐదు గ్రాముల పునర్నవ మూలికను ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవాలి.(Unsplash)
(3 / 6)
నల్ల మిరియాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుంది. వయసు పెరిగిన వారిలో గుండెపోటులను నివారించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం 1 స్పూన్ నల్ల మిరియాలు ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.(Unsplash)
(4 / 6)
శొంఠి జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. ఇది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. భోజనానికి ముందు రోజుకు ఒకసారి గోరు వెచ్చని నీటిలో సగం టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవచ్చు(Unsplash)
(5 / 6)
ఏలకులు ఆయుర్వేదంలో ప్రధానమైన మూలికలలో ఒకటి. ఇది ఆహార కోరికలను అదుపులో ఉంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. (Unsplash)
ఇతర గ్యాలరీలు