తెలుగు న్యూస్ / ఫోటో /
Vastu tips: పెరట్లో మామిడి చెట్టు పెంచుతున్నారా? ఏ దిశలో పెంచాలో తెలుసా?
మామిడి చెట్టును పెరట్లో పెంచే వారి సంఖ్య ఎక్కువే. ఇది ఇంటికి ఏ దిశలో నాటితే ఇంటికి అంతా మేలు జరుగుతుంది. ఇంట్లో ఏ వైపు మామిడి చెట్లు నాటడం శుభమో తెలుసుకోండి.
(1 / 5)
వాస్తు శాస్త్రం ప్రకారం మామిడి చెట్టును ఇంట్లో పెంచడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మామిడి చెట్టును ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు. వాస్తు ప్రకారం నాటితే ఇంటికి శుభం కలుగుతుంది.
(2 / 5)
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని తోటలో నైరుతి దిశలో మామిడి చెట్లను నాటడం ఎంతో శుభప్రదమని చెబుతారు. ఇది కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. కష్టాలు త్వరగా గట్టెక్కుతాయి.
(3 / 5)
ఇంట్లో పొడవైన చెట్లను నాటడం మంచిది కాదు. ఆ చెట్టు నీడ మీ ఇంటిపై పడకూడదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంటి ముందు 5 నుంచి 6 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో చెట్లు నాటడం మంచిది కాదు. ఇంటికి అతి సమీపంలో పెద్ద చెట్టు ఉంటే ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది.
(4 / 5)
ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉంటే ఆ నీడ ఇంటిపై పడే అవకాశం ఉంది. అలా పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలా నీడ పడితే చెట్టును కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇంటి ముందు తులసి మొక్కలు నాటితే సరిపోతుంది. చెడు ప్రభావాలను తులసి మొక్కలు అడ్డుకుంటాయి.
ఇతర గ్యాలరీలు