(1 / 5)
శామ్సంగ్ ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy S24 Ultraతో సహా Samsung Galaxy S24 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ గెలాక్సీ మోడల్స్ లో AI ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది.
(Samsung)(2 / 5)
Samsung Galaxy S24 Ultra లో శక్తిమంతమైన Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ ను అమర్చారు. అలాగే, 5000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఉపయోగించడానికి వినియోగదారులు S-పెన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
(Shaurya Tomer/HT Tech)(3 / 5)
Amazonలో, Samsung Galaxy S24 Ultra 512GB స్టోరేజ్ వేరియంట్ ఒరిజినల్ ధర రూ.1,44,999. అయితే, ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,29,965 లకు ఆమెజాన్ లో పొందవచ్చు. అంటే దాదాపు, 10 శాతం డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
(Shaurya Tomer/HT Tech)(4 / 5)
గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ధరను బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ద్వారా మరింత తగ్గించుకోవచ్చు. OneCard క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీపై ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.1200 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
(Samsung)(5 / 5)
అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కొత్త Samsung Galaxy S24 Ultraతో ఎక్స్చేంజ్ చేసుకుంటే, రూ. 27 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ను బట్టి ఈ ఎక్స్చేంజ్ బోనస్ లో మార్పులు ఉంటాయి.
(Bloomberg)ఇతర గ్యాలరీలు