Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..! ఈ ప్రాంతాలపై ఓ లుక్కేయండి!-good areas for investment in hyderabad real estate key reasons read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..! ఈ ప్రాంతాలపై ఓ లుక్కేయండి!

Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..! ఈ ప్రాంతాలపై ఓ లుక్కేయండి!

Nov 01, 2024, 07:09 PM IST Maheshwaram Mahendra Chary
Nov 01, 2024, 07:09 PM , IST

  • Hyderabad Real Estate : కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇన్నర్ సిటీనే కాదు శివారు ప్రాంతాల్లో కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేందుకు పలు ప్రాంతాలను అనువైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు.

కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ నగరం శరవేరంగా అభివృద్ధి చెందటంతో పాటు విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకోవటంతో ధరలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. చాలా మంది స్థిర నివాసాల కోసం తక్కువ ధరలో ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు మరికొంత మంది పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. 

(1 / 8)

హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు పలు ప్రాంతాలు చాలా అనువైనవిగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా వృద్ధి ఉంటుందని… భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు గల కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. 

(2 / 8)

హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు పలు ప్రాంతాలు చాలా అనువైనవిగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా వృద్ధి ఉంటుందని… భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు గల కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. (image source from unsplash.com)

పెట్టుబడికి అనువైన ప్రాంతాల్లో గచ్చిబౌలి ప్రధానంగా ఉంది. ఇది IT హబ్‌గా పేరు గాంచింది. గచ్చిబౌలి వాణిజ్య, నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.. ప్రముఖ MNC, ఐటీ కంపెనీలకు కూడా కేంద్రంగా మారిపోయింది. ఇక  రోడ్డు కనెక్టివిటీ విషయానికొస్తే ఔటర్ రింగ్ రోడ్ (ORR) పక్కనే ఉంటుంది. అంతేకాకుండా ప్రధాన షాపింగ్ మాల్స్ తో పాటు ప్రముఖ విద్యా సంస్థలు కూడా కొలువుదీరి ఉన్నాయి. 

(3 / 8)

హైదరాబాద్ ఐటీ సెక్టార్ కు హైటెక్ సిటీ ప్రధాన కేంద్రం.  వాణిజ్య ప్రాంతాకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు, రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఈ ప్రాంతం ప్రధాన ప్రదేశమని రియల్ ఎస్టేట్ వ్యాపార నిపుణులు చెబుతున్నారు. శిల్పారామం, నెక్సస్ మాల్ మరియు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వంటి ప్రముఖ కేంద్రాలు ఉండటం కలిసివచ్చే అంశాలని విశ్లేషిస్తున్నారు.

(4 / 8)

హైదరాబాద్ ఐటీ సెక్టార్ కు హైటెక్ సిటీ ప్రధాన కేంద్రం.  వాణిజ్య ప్రాంతాకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు, రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఈ ప్రాంతం ప్రధాన ప్రదేశమని రియల్ ఎస్టేట్ వ్యాపార నిపుణులు చెబుతున్నారు. శిల్పారామం, నెక్సస్ మాల్ మరియు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వంటి ప్రముఖ కేంద్రాలు ఉండటం కలిసివచ్చే అంశాలని విశ్లేషిస్తున్నారు.(image source from unsplash.com)

నార్సింగ్… ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉన్నత స్థాయి నివాస ప్రాంతంగా వార్తల్లో నిలిచింది, నార్సింగి ప్రాంతం విలాసవంతమైన గృహ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గండిపేట్ సరస్సు, ఓషన్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్ వంటి ప్రధాన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.. ఇక్కడ పెట్టుబడి చేస్తే భవిష్యత్తులో అధిక లాభాలుంటాయని చెబుతున్నారు. 

(5 / 8)

నార్సింగ్… ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉన్నత స్థాయి నివాస ప్రాంతంగా వార్తల్లో నిలిచింది, నార్సింగి ప్రాంతం విలాసవంతమైన గృహ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గండిపేట్ సరస్సు, ఓషన్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్ వంటి ప్రధాన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.. ఇక్కడ పెట్టుబడి చేస్తే భవిష్యత్తులో అధిక లాభాలుంటాయని చెబుతున్నారు. (image source from unsplash.com)

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న తెల్లాపూర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ప్రధాన కేంద్రంగా మారింది. ఆధునిక మౌలిక సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతంగా ఉంది. పెట్టుబడికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా మారుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రధానంగా చెబుతున్నారు. 

(6 / 8)

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న తెల్లాపూర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ప్రధాన కేంద్రంగా మారింది. ఆధునిక మౌలిక సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతంగా ఉంది. పెట్టుబడికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా మారుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రధానంగా చెబుతున్నారు. (image source from unsplash.com)

 ప్రశాంతమైన వాతావరణంతో ఉండే రాజేంద్రనగర్ కూడా అనువైన ప్రాంతంగా చెబుతున్నారు.  PVNR ఎక్స్‌ప్రెస్‌వే ORR ద్వారా కనెక్ట్ చేయబడింది. దీంతో ఇక్కడ రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.  ఇక మణికొండ కూడా  వాణిజ్య మరియు నివాస స్థలాలకు కేంద్రంగా మారింది. ల్యాంకో హిల్స్ మరియు ఖాజాగూడ సరస్సు వంటి గుర్తించదగిన ప్రదేశాలు ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో అత్యధికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. 

(7 / 8)

 ప్రశాంతమైన వాతావరణంతో ఉండే రాజేంద్రనగర్ కూడా అనువైన ప్రాంతంగా చెబుతున్నారు.  PVNR ఎక్స్‌ప్రెస్‌వే ORR ద్వారా కనెక్ట్ చేయబడింది. దీంతో ఇక్కడ రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.  ఇక మణికొండ కూడా  వాణిజ్య మరియు నివాస స్థలాలకు కేంద్రంగా మారింది. ల్యాంకో హిల్స్ మరియు ఖాజాగూడ సరస్సు వంటి గుర్తించదగిన ప్రదేశాలు ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో అత్యధికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. (image source from unsplash.com)

వరంగల్ హైవే వైపునకు వెళ్లే ఉప్పల్ కూడా పెట్టుబడికి మెరుగైన ప్రాంతమని రియల్ ఎస్టేట్ వర్గాలు సూచిస్తున్నాయి. జనాదరణ పొందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉప్పల్ ఉందని విశ్లేషిస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అధిక స్థాయిలో గృహ నిర్మాణ రంగంలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా నాగార్జున సాగర్ హైవే ఉండే ఆదిభట్ల ప్రాంతం కూడా పెట్టుబడికి అనువైన ప్రాంతంగా చెబుతున్నారు. ఇక్కడ ఫాక్స్ కాన్ తో పాటు పలు ఐటీ పరిశ్రమలు ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది.పెట్టుబడే పెట్టే విషయంలో మీ నిర్ణయమే ఫైనల్. వ్యాపార,రియల్ ఎస్టేట్ నిపుణులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి)

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు