తెలుగు న్యూస్ / ఫోటో /
Pedicure Hometips: ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పెడిక్యూర్ చేసుకోండి, పాాదాలు మెరిసిపోతాయి
- Pedicure Hometips: చాలా మంది మహిళలు తరచూ పాదాలను కాపాడుకోవడం కోసం పెడిక్యూర్ చేయించుకుంటారు. పాదాల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి పాదాలను క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు కూడా కాదు.
- Pedicure Hometips: చాలా మంది మహిళలు తరచూ పాదాలను కాపాడుకోవడం కోసం పెడిక్యూర్ చేయించుకుంటారు. పాదాల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి పాదాలను క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు కూడా కాదు.
(1 / 8)
మహిళలు పాదాలకు తరచూ పెడిక్యూర్ చేయించుకుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్ని పని. ఇంటి చిట్కాలతోనే పాదాలను మెరిపించుకోవచ్చు.(freepik)
(2 / 8)
ఓట్ మీల్, మజ్జిగ: ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ నేచురల్ పేస్ట్ ను టాన్ అయిన ప్రాంతాలపై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. చల్లటి నీటితో కడిగేసుకుంటే మెరిసే పాదాలు లభిస్తాయి.(freepik)
(3 / 8)
పెరుగు, పసుపు: ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ పాదాలకు అప్లై చేయండి. సుమారు 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మపు చికాకును నివారిస్తుంది. పసుపు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.(freepik)
(4 / 8)
అలోవెరా జెల్: తాజా కలబంద జెల్ ను రాత్రి పడుకునే ముందు నేరుగా పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే పాదాలను శుభ్రం చేసుకోవాలి. కలబంద పిగ్మెంటేషన్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.(freepik)
(5 / 8)
బంగాళాదుంప: బంగాళాదుంపను మెత్తగా రుబ్బి దాని రసాన్ని పిండండి. బంగాళాదుంప రసాన్ని టాన్ అయిన ప్రాంతాల్లో అప్లై చేసి 20 నుండి 30 నిమిషాలు అలాగే వదిలేయండి. బంగాళాదుంప జ్యూస్ లో ఉండే ఎంజైమ్స్ చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి.(freepik)
(6 / 8)
టమోటో: టమోటా గుజ్జును పాదాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. టమోటాల్లో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది టాన్ కలర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.(freepik)
(7 / 8)
శెనగపిండి, పసుపు: శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలపాలి. ఈ పేస్ట్ ను చిక్కగా చేసి పాదాలకు అప్లై చేసి ఆరిపోయే వరకు వదిలేయాలి. ఆ తర్వాత సున్నితంగా రుద్ది నీటితో కడిగేయాలి.(freepik)
ఇతర గ్యాలరీలు