Sunil Chhetri Love Story : కోచ్ కూతురితో సీక్రెట్ లవ్.. 13 ఏళ్లు డేటింగ్.. అబ్బో సునీల్ ఛెత్రిది పెద్ద కథే-football player sunil chhetri sonam bhattacharya dated 13 years before marriage heres their beautiful love story ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunil Chhetri Love Story : కోచ్ కూతురితో సీక్రెట్ లవ్.. 13 ఏళ్లు డేటింగ్.. అబ్బో సునీల్ ఛెత్రిది పెద్ద కథే

Sunil Chhetri Love Story : కోచ్ కూతురితో సీక్రెట్ లవ్.. 13 ఏళ్లు డేటింగ్.. అబ్బో సునీల్ ఛెత్రిది పెద్ద కథే

Jun 19, 2023, 10:08 AM IST Anand Sai
Jun 19, 2023, 10:08 AM , IST

  • భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రీ, సోనమ్ భట్టాచార్యల ప్రేమ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ జంట పెళ్లికి ముందు 13 సంవత్సరాలు డేటింగ్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుట్ బాల్ చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇండియాలో ఫుట్‌బాల్‌కు పెద్దగా గుర్తింపు లేకపోయినా, సునీల్ ఛెత్రీ మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో భారత్‌కు అంతగా పేరు లేకపోయినా.. జట్టు కెప్టెన్ ఛెత్రీ మాత్రం గొప్ప విజయాలు సాధించాడు.

(1 / 13)

ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి చూద్దాం.. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో వనాటుపై 1 గోల్ చేసిన ఛెత్రీ సంబరాలు చేసుకున్నాడు. విభిన్నంగా తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు.

(2 / 13)

గోల్ చేసిన తర్వాత, ఛెత్రీ తన జెర్సీలో బంతిని దాచాడు. భార్య సోనమ్ భట్టాచార్యకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అప్పుడు సోనమ్ కూడా లేచి ప్రేమగా రెస్పాండ్ అయింది.

(3 / 13)

సునీల్ ఛెత్రి మరియు సోనమ్ భట్టాచార్య ప్రేమకథ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. క్రీడల్లోనే కాదు ప్రేమలో కూడా ఛెత్రి కొందరికి రోల్ మోడల్. ఛెత్రికి 18 ఏళ్లు, సోనమ్‌కు 15 ఏళ్ల వయసులో వీరి ప్రేమ కథ  మొదలైంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సోనమ్ ఎవరో కాదు.. తన కోచ్ మోహన్ బగాన్ కుమార్తె.

(4 / 13)

మోహన్ బగాన్ తన కూతురు ముందు సునీల్ ఛెత్రిని కీర్తిస్తూ ఉండేవాడు. దీంతో ఇంప్రెస్ అయిన సోనమ్ తన తండ్రి సెల్ ఫోన్ నుంచి ఛెత్రీ నెంబర్ దొంగిలించింది. ఆ తర్వాత అతడికి వీరాభిమానిగా మారిపోయింది. నిన్ను ఒక్కసారి కలవాలని మెసేజ్ పంపింది. అక్కడి నుంచి వీరి ప్రేమకథ మొదలైంది.

(5 / 13)

ఈ సమావేశంలో ఇంకా చిన్నపిల్లలమేనని ఛెత్రీ  చెప్పాడు. చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలని తెలిపాడు. కానీ, అది అక్కడితో ముగియలేదు. సోనమ్ చాలా అటాచ్ అయ్యింది. ఒకరికొకరు టెక్స్ట్ చేస్తూనే ఉండేవారు. ఓ సారి మెసేజ్‌లు పంపుతుండగా సోనమ్ తండ్రి బగాన్ చూశాడు.

(6 / 13)

ఈ సంఘటన తర్వాత, ఇద్దరూ కొన్ని రోజులు తమ లవ్ స్టోరీని సైలెంట్ చేయాలనుకున్నారు. భయంతో కోచ్‌తో మాట్లాడడం మానేశాడు సునీల్ ఛెత్రి. అయినా ఆమెను మరిచిపోలేకపోయాడు. దాంతో మళ్లీ రహస్యంగా కబుర్లు చెప్పుకోవడం, కలవడం మొదలుపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా ఇలానే సాగింది. ఇద్దరూ గాఢమైన ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు వదిలి వెళ్లలేనంతగా ప్రేమించుకున్నారు. 

(7 / 13)

ఓ రోజు చాలా ధైర్యంగా వెళ్లి ఛెత్రి.. తమ ప్రేమ గురించి సోనమ్ తండ్రికి చెప్పాడు. అయితే సోనమ్ తండ్రి రెండో ఆలోచన లేకుండా పెళ్లికి అంగీకరించాడు. 2017 డిసెంబర్ 4వ తేదీన కోల్‌కతాలో అంగరంగ వైభవంగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

(8 / 13)

ఛెత్రి, సోనమ్ పెళ్లి చేసుకోవడానికి ముందు 13 సంవత్సరాలు డేటింగ్ చేశారు. వారు రహస్యంగా కలుసుకునేవారు.

(9 / 13)

గతేడాది ఫిఫా ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. ఇందుకోసం ఖతార్ లో ఈ భారీ టోర్నీని నిర్వహించారు. అయితే ఈ టోర్నీకి ముందు ఫిఫా దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రిని గుర్తించి ప్రత్యేక గౌరవం లభించింది. ఫెంటాస్టిక్ కెప్టెన్ అని పిలిచారు. రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఛెత్రి.

(10 / 13)

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఛెత్రీ ఇప్పటివరకు 87 గోల్స్ చేశాడు. అతను ప్రపంచంలోని యాక్టివ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ చేసిన 3వ ఆటగాడు. 122 గోల్స్ చేసిన పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా, 103 గోల్స్ చేసిన లియోనెల్ మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు.

(11 / 13)

సునీల్ ఛెత్రి, విరాట్ కోహ్లీ సన్నిహిత మిత్రులు. సమయం దొరికితే కలుసుకుంటారు.

(12 / 13)

సునీల్ ఛెత్రి, విరాట్ కోహ్లీ సన్నిహిత మిత్రులు. సమయం దొరికితే కలుసుకుంటారు.

సునీల్ ఛెత్రి మరియు సోనమ్ భట్టాచార్య.

(13 / 13)

సునీల్ ఛెత్రి మరియు సోనమ్ భట్టాచార్య.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు