TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు - ఈ లింక్ తో సింపుల్ గా దరఖాస్తు చేయండి-follow this process oftelangana graduate mlc vote registration 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Graduate Mlc Vote Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు - ఈ లింక్ తో సింపుల్ గా దరఖాస్తు చేయండి

TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు - ఈ లింక్ తో సింపుల్ గా దరఖాస్తు చేయండి

Published Jan 21, 2024 09:12 AM IST Maheshwaram Mahendra Chary
Published Jan 21, 2024 09:12 AM IST

  • Telangana Graduate MLC Voter Registration 2024: త్వరలోనే ఉపఎన్నిక జరగనున్న వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. పలు వివరాలను ఇక్కడ చూడండి….

త్వరలోనే వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఓటర్ లిస్ట్ షెడ్యూల్ విడుదల ;చేసింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో…. ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

(1 / 5)

(https://ceotelangana.nic.in/#)

గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ… మళ్లీ నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 2023 నవంబరు 1వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయిన వారు ఓటు నమోదుకు అర్హులు అవుతారు.

(2 / 5)

ఆఫ్ లైన్ లో అంటే తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించవచ్చు.  డిగ్రీ పూర్తిచేసిన వారు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల ధ్రువపత్రం, లేదా డిగ్రీ పట్టా నకలు పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. అదేవిధంగా ఒరిజినల్‌ పత్రాలను చూపించి నకలు పత్రాలపై అధికారి సంతకం చేయించుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, చిరునామా ధ్రువపత్రాలు రెండు పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాలి. 

(3 / 5)

ఫారమ్ 18 ద్వారా ఓటరు నమోదు దరఖాస్తును పూర్తి చేయాలి.  ఆన్ లైన్ లో చేసుకోవాలనుకునే వారు ముందుగా https://ceotelangana.nic.in/home.html   సైట్ లోకి వెళ్లాలి. ఇందుకోసం  ఈ- రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే council constituency  ఆప్షన్ పై నొక్కాలి. అలా చేస్తే ఫారమ్ 18 ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలను నింపాలి.

(4 / 5)

ఓటు నమోదుకు ఫిబ్రవరి 6 తుది గడువుగా నిర్ణయించింది ఈసీ.  24, ఫిబ్రవరి, 2024న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 4, ఏప్రిల్, 2024వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు