తెలుగు న్యూస్ / ఫోటో /
Medaram Jatara In Pics: మేడారంలో భక్తుల కోలాహలం… సాయంత్రం గద్దెల మీద కొలువుదీరనున్న వన దేవతలు
- Medaram Jatara In Pics: ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వేళైంది. బుధవారం సాయంత్రం సారలమ్మ మేడారం గద్దెలకు చేరుకోవడంతో మహాజాతర ప్రారంభం కానుంది. మేడారం జాతర చిత్రాలు మీ కోసం..

(1 / 7)
మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకోగా.. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు. బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది
(5 / 7)
మేడారం జాతర కోసం ముస్తాబైన ఆలయం. జాతరలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకోగా.. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు. బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది
ఇతర గ్యాలరీలు