తెలుగు న్యూస్ / ఫోటో /
Cyclone Dana: ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో దాన తుపాను ప్రభావం ఫొటోలు
- Cyclone Dana: పెను తుపాను దాన ను ఎదుర్కోవడానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ రాత్రి ఒడిశా, బెంగాల్ ల మధ్య తుపాను తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 120 కిమీల వేగంతో పెను గాలులు వీస్తాయి. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఒడిశాలో 20 బృందాలను, పశ్చిమ బెంగాల్లో 17 బృందాలను మోహరించింది.

(1 / 7)
ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న లక్షా 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.(AFP)
(2 / 7)
ఒడిశాలో 20 బృందాలను మోహరించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మొహ్సేన్ షహేదీ గురువారం తెలిపారు.(ANI)
(3 / 7)
'దాన' తుఫాను దృష్ట్యా రెండు రాష్ట్రాల రాజధాని నగరాలైన కోల్ కతా, భువనేశ్వర్ లకు 200కు పైగా రైళ్లను రద్దు చేశారు.(PTI)
(4 / 7)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను మరింత బలపడి ఒడిశాలోని భితర్కనికా నేషనల్ పార్క్, ధమ్రా పోర్టు మధ్య శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది.(HT Photo)
(5 / 7)
ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, డానా తుఫాను తీరం దాటడం వల్ల తలెత్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంబంధిత అన్ని శాఖలు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.(ANI)
(6 / 7)
చేపల వేటకు సముద్రంలోనికి వెళ్లవద్దని భద్రక్ జిల్లాలో మత్స్యకారులకు సూచిస్తున్న అధికారులు(PTI)
ఇతర గ్యాలరీలు