AP TS Weather Updates : సీమ జిల్లాలపై భానుడి ప్రతాపం - ఉత్తర కోస్తాకు వర్ష సూచన..!
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలోనే జనాలు చుక్కలు చూస్తున్నాయి. అయితే ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కోస్తా, సీమ జిల్లాలో ఎండలు ఉండగా… ఉత్తర కోస్తాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.(https://unsplash.com/)
(2 / 6)
నిన్నటి ఐఎండీ రిపోర్టు(మార్చి 09) ప్రకారం...కర్నూలులో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇక అనంతపురంలో 40.5 డిగ్రీలుగా నమోదైంది. నంద్యాల, తిరుపతి, కడప, తుని, గన్నవరం ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది.(https://unsplash.com/)
(3 / 6)
ఓవైపు ఎండలు దంచికొడుతుండగా... ఏపీలోని ఉత్తర కోస్తాకు మాత్రం చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (https://unsplash.com/)
(4 / 6)
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.(https://unsplash.com/)
(5 / 6)
తెలంగాణలో చూస్తే… ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.(https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు