Chandrababu : నా కాళ్లకు మొక్కితే తిరిగి వాళ్ల కాళ్లకు మొక్కుతా, నేతల కాళ్లు మొక్కే సంస్కృతి మంచిది కాదు -సీఎం చంద్రబాబు-cm chandrababu laid stone to hare krishna kolanukonda temple request people do not touch his feet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chandrababu : నా కాళ్లకు మొక్కితే తిరిగి వాళ్ల కాళ్లకు మొక్కుతా, నేతల కాళ్లు మొక్కే సంస్కృతి మంచిది కాదు -సీఎం చంద్రబాబు

Chandrababu : నా కాళ్లకు మొక్కితే తిరిగి వాళ్ల కాళ్లకు మొక్కుతా, నేతల కాళ్లు మొక్కే సంస్కృతి మంచిది కాదు -సీఎం చంద్రబాబు

Jul 13, 2024, 02:35 PM IST Bandaru Satyaprasad
Jul 13, 2024, 02:35 PM , IST

  • CM Chandrababu : మంచికి వచ్చే ఐదేళ్లు స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు అన్నారు. కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేయొద్దని సీఎంచంద్రబాబు కోరారు.

ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరి అదృష్టమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని అన్నారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘‘ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతామన్న నమ్మకాన్ని హరేకృష్ణ మూవ్ మెంట్ మనకు కలిగిస్తుంద్నారు.  

(1 / 8)

హరేకృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రాలు దేశంలో 20 ఉన్నాయి...వివిధ దేశాల్లో మరో 5 ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. హరేకృష్ణ మూవ్ మెంట్ తో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోందన్నారు.  మధుపండిత్ దాస అనుకున్నది సాధిస్తారని, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారన్నారు. సత్యగౌర చంద్రదాస్ కూడా ఐఐటీలో చదివారని,  హరేకృష్ణ మూవ్ మెంట్ లో ఐఐటీలో చదివిన వారు 50 మంది ఉన్నారన్నారు. ఇస్కాన్ లో కూడా ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పొందిన వారున్నారన్నారు. మన దేశ సంసృతి, సంప్రదాయాలు కాపాడటానికి వారు జీవితాలు త్యాగాలు చేశారన్నారు.  

(2 / 8)

హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్టాత్మక నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. 216 అడుగల ఎత్తున్న ప్రధాన గోపురంతో వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మిస్తున్నారన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలైనా ఈ భూమిపై లేకపోతే జైళ్లు చాలవని, నేరాలు, ఘోరాలు ఎన్నో జరిగేవన్నారు. సైంటిస్టులు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, న్యాయ వ్యవస్థ...ఇలా అందరూ తమ విధులు ప్రారంభించడానికి ముందు రెండు నిమిషాల పాటు దేవున్ని ప్రార్థిస్తారన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా దేవుడికి ప్రార్థనలు చేశాకే రాకెట్లు నింగిలోకి పంపుతారన్నారు. 

(3 / 8)

హరేకృష్ణ మూవ్ మెంట్ దేవుని సేవ మాత్రమే కాకుండా మానవ సేవ కూడా చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. యూపీలో వంద ఎకరాల్లో 700 అడుగుల కృష్ణుడు దేవాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. కొలనుకొండలో 6.5 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. తాను సాంకేతిక పరిజ్ణానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, 25 ఏళ్లకు ముoదు ఐటీని ప్రమోట్ చేస్తే అన్ని దేశాలకు మన దేశానికి చెందిన వారు వెళ్లారన్నారు. వారిలో 30 వాతం మంది తెలుగు వారు ఉన్నారన్నారు. నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామినే నమ్ముతానన్నారు. మా కుటుంబ ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి అని చంద్రబాబు అన్నారు. ప్రతి రోజు రెండు నిమిషాలు దేవున్ని తలుచుకుంటాన్నారు. 

(4 / 8)

2003లో తిరుపతిలో 23 క్లేమోర్ మైన్స్ పేలినప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామే అని సీఎం చంద్రబాబు అన్నారు. మరింత శక్తి, సామర్థ్యాన్ని ఇవ్వాలని, దేశంలో తెలుగువారు నెంబర్ వన్ జాతిగా ఉండేలా దీవించాలని కోరుకుంటానన్నారు. పేదరికం లేని సమాజం మనందరి బాధ్యత కావాలని సీఎం చంద్రబాబు పిలపునిచ్చారు. అక్షయపాత్ర యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. మధుపండిత్ దాస్ నేతృత్వంలో అక్షయపాత్రను విజయవంతంగా నడిపిస్తున్నారని కితాబు ఇచ్చారు. శ్రీకృష్ణుడి ఆలయం ఉన్న 10 కి.మీ పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఆలోచనతో లాలా ప్రభుపాద స్ఫూర్తితో అక్షయపాత్రను ప్రారంభించారన్నారు. 23 ఏళ్లలో 400 కోట్లమందికి భోజనం పెట్టారన్నారు. 

(5 / 8)

వివిధ రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా, నాణ్యతతో అక్షయపాత్ర ద్వారా అందిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. 22 లక్షల మందికి ప్రతి రోజూ అక్షయపాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నారని గుర్తుచేశారు. కృష్ణాపుష్కరాల సమయంలో 3 లక్షల మందికి భోజనం అందించారని, అన్న క్యాంటీన్ కు భోజన సరఫరా కూడా గతంలో అక్షయపాత్రకే అప్పగించామన్నారు. భోజన నాణ్యతలో ఒక్క చిన్న ఫిర్యాదు లేకుండా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేశారన్నారు.  203 అన్న క్యాంటీన్లు నాడు నిర్వహించామన్నారు. కానీ గడిచిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసిందన్నారు.  త్వరలోనే అన్న క్యాంటీన్లు పున:ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.  

(6 / 8)

ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ప్రారంభించారని సీఎం చంద్రబాబు తెలిపారు.  దాతలకు దేశంలో కొదవలేదు..నమ్మకం అనే వ్యవస్థ ఉండాలన్నారు. అక్షయపాత్ర ఆధునిక వసతులతో కిచెన్ ను నడిపిస్తోందని, ప్రజల నమ్మకం, భగవంతుడు ఆశీస్సులు హరేకృష్ణ గోకులం వారికి తప్పకుండా ఉంటాయన్నారు. పెనుకొండలో లక్ష్మీనరసింహా స్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఏకశిలా రూపంలో ఏర్పాటు చేయడానికి హరే కృష్ణ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. దానికి కూడా గత ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. మంచికి వచ్చే ఐదేళ్లు స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు అన్నారు.  

(7 / 8)

ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేయొద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని...ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని....నాయకులకు కాదని అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.....తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని సీఎం అన్నారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. ఆత్మగౌరవంతో అంతా నడుచుకోవాలని...కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు