NDA Meeting : ఎన్డీయే పక్ష నేతగా మోదీ - ఏపీ నేతలపై పొగడ్తలు-chandrababu and pawan kalyan photos with pm modi in nda mps meeting at delhi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nda Meeting : ఎన్డీయే పక్ష నేతగా మోదీ - ఏపీ నేతలపై పొగడ్తలు

NDA Meeting : ఎన్డీయే పక్ష నేతగా మోదీ - ఏపీ నేతలపై పొగడ్తలు

Jun 07, 2024, 04:48 PM IST Maheshwaram Mahendra Chary
Jun 07, 2024, 04:48 PM , IST

  • NDA Parliamentary Party Meeting at Delhi : ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం ఎన్డీయే ఎంపీల భేటీ జరిగింది. ఆయా పార్టీల అధినేతలు కూడా ఇందుకు హాజరయ్యారు. ప్రధానిగా మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర వేశారు.

ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం ఎన్డీయే ఎంపీల భేటీ జరిగింది. ఆయా పార్టీల అధినేతలు కూడా ఇందుకు హాజరయ్యారు. ఏపీ నుంచి కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు.

(1 / 7)

ఎన్డీయే కూటమి నేతగా మోదీని ఎన్నుకున్న తర్వాత… టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. వెంకటేశ్వరస్వామి ప్రతిమను మోదీకి అందించారు.

(2 / 7)

ఈ సమావేశం  సందర్భంగా భారత రాజ్యాంగానికి ప్రధాని మోదీ నమస్కరించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీష్‌ సహా 9 మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు వేదికపై ఉన్నారు. 

(3 / 7)

ఎన్డీయే కూటమిలోని నేతలు ప్రధాని మోదీకి అభినందలు తెలిపారు. పూలదండలతో పాటు శాలువాలు కప్పి విషెస్ చెప్పారు. 

(4 / 7)

ఎన్టీయే కూటమి నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించారు. అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ బలపరిచారు. ఎన్డీయేపక్ష నేతగా మూడో సారి ఎన్నికైన నరేంద్రమోదీ.. ప్రధానిగా దేశానికి మరోసారి సేవలు అందించబోతున్నారు.

(5 / 7)

ఈ భేటీలో ప్రధాని మోదీ చంద్రబాబుతో పాటు పవన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ అంటే వ్యక్తి కాదని… తుఫాన్ అంటూ పొగిడారు. కూటమికి ఆంధ్రా ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు.

(6 / 7)

ఈ సమావేశానికి కూటమి నేతలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు