Telangana Tourism : 'భీముని పాదం' జలపాతం చూశారా..? మంచి టూరిస్ట్ ప్లేస్, ఒకే రోజులో చూసి రావొచ్చు..!
- మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తున్నారు. ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చూడండి...
- మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తున్నారు. ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చూడండి...
(1 / 6)
ప్రస్తుతం వర్షాకాలం కావటంతో తెలంగాణలోని పలు జలపాతాల వద్ద సందడి కనిపిస్తోంది. ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలోని భీముని పాదం జలపాతం వద్ద కూడా ఉంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తున్నారు. (Image Source https://mahabubabad.telangana.gov.in/)
(2 / 6)
భీముని పాదం జలపాతం మహబూబాబాద్ లోని గూడూర్ మండలంలోని సీతనగరం గ్రామంలో ఉన్నాయి. గుడూర్ బస్ స్టాండ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 55 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఖమ్మం బస్ స్టేషన్ నుండి 88 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవిలో ఈ సుందరమైన జలపాతం దాగి ఉంది. (Image Source https://mahabubabad.telangana.gov.in/)
(3 / 6)
ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇది కుటుంబ పిక్నిక్‌లకు అనువైనదిగా చెబుతుంటారు. సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు నీరు ఇంద్రధనస్సు రంగులలో ప్రకాశిస్తుంది, ఇది అద్భుతమైన దృశ్యమని చెప్పొచ్చు. నీరు సుమారు 70 అడుగుల ఎత్తు నుండి క్రిందికి పడుతుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం భారీగా ఉంటుంది.(Image Source https://mahabubabad.telangana.gov.in/)
(4 / 6)
జలపాతమే కాకుండా సమీపంలో అనేక సరస్సులు కూడా ఉన్నాయి. జలపాతం దగ్గర ఒక చిన్న ఆవరణలో శివుడు, నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. వీకెండ్స్ లో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు చాలా మంది వస్తుంటారు.
(5 / 6)
భీముని పాదం జలపాతానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. భీమసేనుడు అడుగుపెట్టడంతో ఈ జలపాతం ఏర్పడిందని చెబుతుంటారు.
ఇతర గ్యాలరీలు