తెలుగు న్యూస్ / ఫోటో /
Bentley GT-S | స్పోర్టియర్ లుక్‌తో బెంట్లీ కాంటినెంటల్ కార్లలో కొత్త మోడల్స్!
- బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ ఇటీవలే తమ స్పోర్టీ కాంటినెంటల్ GT S కారును కొన్ని కొత్త ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో పరిచయం చేసింది. ఈ సరికొత్త GT S ట్రిమ్ కూపే అలాగే కన్వర్టిబుల్ బాడీ స్టైల్స్‌తో అందుబాటులో ఉంటుంది.
- బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ ఇటీవలే తమ స్పోర్టీ కాంటినెంటల్ GT S కారును కొన్ని కొత్త ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో పరిచయం చేసింది. ఈ సరికొత్త GT S ట్రిమ్ కూపే అలాగే కన్వర్టిబుల్ బాడీ స్టైల్స్‌తో అందుబాటులో ఉంటుంది.
(1 / 8)
బెంట్లీ కాంటినెంటల్ GT, GTC కార్లలో ఇప్పుడు కొత్తగా స్పోర్టీ S శ్రేణి వచ్చి చేరింది. బెంట్లీ నుండి వచ్చిన ఈ S శ్రేణి మోడల్ కార్లు మరింత మెరుగైన పనితీరు, స్పోర్టి ఎక్ట్సీరియర్‌తో వచ్చాయి. (Bentley)
(2 / 8)
కొత్తగా వచ్చిన బెంట్లీ కాంటినెంటల్ GT, GTC S మోడళ్ల వెలుపలి భాగం ముందు ఫెండర్‌లపై S బ్యాడ్జింగ్‌తో పాటు బ్లాక్ గ్లోస్ రేడియేటర్ గ్రిల్‌ను కలిగి ఉంది. వీల్స్ కూడా కొత్తగా ఉన్నాయి.
(3 / 8)
బెంట్లీ కాంటినెంటల్ GT, GTC S కార్లలో హెడ్‌ల్యాంప్‌లు, వెనుక లైట్లు ముదురు రంగులో ఉంటాయి. అయితే బెంట్లీ బ్యాడ్జ్, ప్రకాశవంతమైన క్రోమ్‌లో వచ్చే అక్షరాలు మినహా అన్ని ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్ గ్లోస్ బ్లాక్‌లో ఉంటాయి.
(4 / 8)
బెంట్లీ కాంటినెంటల్ GT, GTC S శ్రేణి కార్లు రెండు రకాల వీల్స్ ఎంపికలతో వస్తాయి. ఒకటి 22-అంగుళాలతో Y-ఆకారపు 5 స్పో గ్లోస్ బ్లాక్‌లో వస్తుండగా.. మరొకటి 21-అంగుళాల ట్రై-స్పోక్ వీల్ డిజైన్. రెడ్-పెయింటెడ్ బ్రేక్ కాలిపర్‌లు వీల్స్ లోపల ఇమిడి ఉంటాయి.
(5 / 8)
హుడ్ కింద, ఈ రెండు బెంట్లీ S శ్రేణి మోడల్‌లు 4.0-లీటర్ V8 ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఇది 542 bhp పవర్ 770 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4 సెకన్లలోనే 0-100 కిమీ వేగంతో దూసుకుపోగలవు.
(6 / 8)
బెంట్లీ కాంటినెంటల్ GT, GTC S శ్రేణి మోడల్‌లలో V8 స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను విస్తరింపజేశారు. ఈ కార్ గరిష్ట వేగం గంటకు 318 కిలోమీటర్లు.
(7 / 8)
బెంట్లీ కాంటినెంటల్ GT, GTC S కార్లలో క్యాబిన్ సరికొత్తగా ఇచ్చారు. ఇంటీరియర్‌లు 2-టోన్ కలర్ స్ప్లిట్‌ను కలిగి ఉంటాయి. ఇలా కేవలం S మోడళ్లకు మాత్రమే ప్రత్యేకంగా అందిస్తున్నట్లు లగ్జరీ ఆటోమేకర్ పేర్కొంది. కూర్చోటానికి సౌకర్యవంతమైన ఫ్లూటెడ్ S డిజైన్ స్పోర్ట్స్ సీట్లతో పాటు క్విల్టింగ్‌ను ఒక ఛాయిస్ గా అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతి సీటు హెడ్‌రెస్ట్‌పై 'S' చిహ్నం ఎంబ్రాయిడరీ చేసి ఉంది. డైనామికా, లెదర్ కలయిక వల్ల క్యాబిన్ లోపల ఇంటీరియర్స్ స్మూత్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు