తెలుగు న్యూస్ / ఫోటో /
Black Cumin: నల్లజీలకర్ర తినమని చెబుతున్న ఆయుర్వేదం, ఆ సమస్యలన్నీ దూరం
ఆయుర్వేదంలో నల్ల జీలకర్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిని కలోంజి అంటారు. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటివి రాకుండా వీటిని అడ్డుకుంటుంది.
(1 / 5)
సాధారణ జలుబులో ఇబ్బందిపెట్టే విషయం ముక్కు దిబ్బడ. జలుబు వల్ల శరీరం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కలోంజి ని తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
(2 / 5)
నల్ల జీలకర్ర నీటిలో చిన్న వస్త్రాన్ని ముంచి ముక్క దగ్గర పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. బెంగాల్‌లో ఈ సంప్రదాయం రెమెడీ.
(3 / 5)
ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర, మూడు టీస్పూన్ల తేనె, రెండు టీస్పూన్ల తులసి ఆకుల రసం కలిపి తింటే జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. జ్వరం కూడా తగ్గుతుంది.
(4 / 5)
నల్ల జీలకర్ర పేస్ట్‌ను జలుబుకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. బెంగాలీలు చేపల కూరలో వెల్లుల్లి, నల్ల జీలకర్ర పేస్ట్ వేసి వండుతారు. ఆ పులుసును తినడం వల్ల జలుబు తగ్గుతుంది. నల్ల జీలకర్ర పేస్టును నుదుటిపై అప్లై చేయాలి. నల్ల జీలకర్ర శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు.
(5 / 5)
రోగనిరోధక శక్తికి, పొట్టనొప్పి సమస్యలకు కలోంజి మేలు చేస్తుంది. నల్ల జీలకర్రను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరకప్పు చల్లటి పాలలో కలోంజి పొడిని చిటికెడు వేసుకుని తాగితే అజీర్ణం తగ్గుతుంది. ఈ నల్ల జీలకర్రతో చేసిన నూనెను వాడితే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మైగ్రేన్ సమస్యలను తగ్గిస్తుంది. నుదుటిపై నూనెతో మసాజ్ చేస్తే మైగ్రేన్ నొప్పి నుండి బయటపడవచ్చు.
ఇతర గ్యాలరీలు