Arunachalam Tour Package : ఈనెలలో 'అరుణాచలం' వెళ్తారా..! 4 రోజుల టూర్ ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం-arunachalam tour from hyderabad in september month 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Arunachalam Tour Package : ఈనెలలో 'అరుణాచలం' వెళ్తారా..! 4 రోజుల టూర్ ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం

Arunachalam Tour Package : ఈనెలలో 'అరుణాచలం' వెళ్తారా..! 4 రోజుల టూర్ ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం

Sep 07, 2024, 01:55 PM IST Maheshwaram Mahendra Chary
Sep 07, 2024, 01:55 PM , IST

  • TG Tourism Arunachalam Tour Package : అరుణాచలం దర్శనం వెళ్లే వారి కోసం తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేేసే ఈ ప్యాకేజీ… 4 రోజుల పాటు సాగుతుంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు. https://tourism.telangana.gov.in/  వెబ్ సైట్ లోకి బుకింగ్ చేసుకోవాలి. 

దేశవ్యాప్తంగానూ అరుణాచలేశ్వరుడి దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

(1 / 5)

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… ప్రస్తుతం సెప్టెంబర్ 15, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే… వచ్చే నెల(అక్టోబరు)లో వెళ్తే ఆలోచన ఉంటే ఆ తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు.

(2 / 5)

https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి హైదరాబాద్ - అరుణాచలం ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

(3 / 5)

మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు. మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

(4 / 5)

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ :   https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=342&journeyDate=2024-08-16&adults=2&childs=0

(5 / 5)

ఇతర గ్యాలరీలు