AP Weather Alert : రేపు, ఎల్లుండి ఏపీకి వర్ష సూచన-ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- AP Weather Alert : రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతారవణ కేంద్రం తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Weather Alert : రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతారవణ కేంద్రం తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకు విస్తరించిన ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. (Pexels)
(2 / 6)
ద్రోణి ప్రభావంతో రేపు(గురువారం) మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
(3 / 6)
ఎల్లుండి(శుక్రవారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 38.5 మిమీ, మన్యం జిల్లా పాలకొండలో 35.2 మిమీ, శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో 35.2 మిమీ, పాతపట్నంలో 22.7 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
(4 / 6)
రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతారవణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ప్రకటించింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. (Pexels)
(5 / 6)
నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు