AP Polycet Spot Admissions : ముగిసిన ఏపీ పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్, మిగిలిన సీట్లకు జులై 31 స్పాట్ అడ్మిషన్లు-ap polycet 2024 final phase counselling completed spot admission on july 31 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Polycet Spot Admissions : ముగిసిన ఏపీ పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్, మిగిలిన సీట్లకు జులై 31 స్పాట్ అడ్మిషన్లు

AP Polycet Spot Admissions : ముగిసిన ఏపీ పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్, మిగిలిన సీట్లకు జులై 31 స్పాట్ అడ్మిషన్లు

Jul 24, 2024, 09:41 PM IST Bandaru Satyaprasad
Jul 24, 2024, 09:41 PM , IST

  • AP Polycet Spot Admissions : పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్ ముగిసింది. అయితే మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.  పాలిటెక్నిక్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను జులై 27న నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నారు. 

పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్ ముగిసింది. అయితే మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. 

(1 / 6)

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో మిగిలిన సీట్లను పాలిసెట్ అర్హత సాధించినా, అర్హత లేని అభ్యర్థులతో ఆయా పాలిటెక్నక్ ల స్థాయిలో భర్తీ చేస్తామని కన్వీనర్ తెలిపారు.  

(2 / 6)

పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ సీట్ల కోసం సంబంధిత పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్‌లను సంప్రదించి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. 

(3 / 6)

పాలిటెక్నిక్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను శాఖలు, కేటగిరీల వారీగా జులై 27న నోటీస్ బోర్డులో పెడతారని కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు. 

(4 / 6)

ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్ణయించిన రుసుముతో జులై 31న వ్యక్తిగతంగా విద్యార్థులు సీటు ఆశిస్తున్న పాలిటెక్నిక్‌లకు హాజరు కావాలని కన్వీనర్ స్పష్టం చేశారు. 

(5 / 6)

పాలీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటికే కేటాయింపు పొందిన, కోర్సులో చేరిన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్‌కు అర్హులు కాదని కన్వీనర్ తెలిపారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని పేర్కొన్నారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు