AP TG Weather Updates : మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. తెలంగాణలో మరో రెండు మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలంగాణలో మరో రెండు మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.
(2 / 6)
జులై 24 మధ్యాహ్నం 1 నుంచి జులై 25వ తేదీ వరకు చూస్తే తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (Image Source @APSDMA Twitter)
(3 / 6)
ఇక సిరిసిల్ల, కరీంనగర్, భూపాలల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. (Image Source @APSDMA Twitter)
(4 / 6)
రేపు రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (Image Source @APSDMA Twitter)
(5 / 6)
జులై 26వ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. (Image Source @APSDMA Twitter)
ఇతర గ్యాలరీలు