Amaravati Capital Designs : రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలు, అవే డిజైన్లు ఖరారు చేసిన సర్కార్-amaravati capital iconic buildings govt green signal to norman foster designs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amaravati Capital Designs : రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలు, అవే డిజైన్లు ఖరారు చేసిన సర్కార్

Amaravati Capital Designs : రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలు, అవే డిజైన్లు ఖరారు చేసిన సర్కార్

Updated Oct 15, 2024 04:09 PM IST Bandaru Satyaprasad
Updated Oct 15, 2024 04:09 PM IST

Amaravati Capital Designs : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు స్పీడందుకున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ దాదాపు పూర్తైంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయాల ఆకృతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు స్పీడందుకున్నాయి. రాజధాని ప్రాంతంలో దాదాపుగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయాల ఆకృతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

(1 / 6)

2014లో అధికారం చేపట్టిన టీడీపీ...అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం రాజధానిలో ప్రభుత్వ, అధికారుల భవనాలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో ఐకానిక్‌ భవనాలకు డిజైన్లను 2018లో లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించింది. 

(2 / 6)

(PC : Twitter)

అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయ భవనాల డిజైన్లు మార్చకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లనే కొనసాగించేలా యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఐకానిక్‌ బిల్డింగ్ ల డిజైన్లపై ఉన్నతస్థాయిలో చర్చించారు. ఆరేళ్ల క్రితం ఆకృతుల్లో.. ఇప్పుడేమైనా మార్పుచేర్పులు చేయాలా? అనే విషయంపై చర్చించారు. 

(3 / 6)

ఐకానిక్ భవనాల బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులు చేయరాదని, అవసరమైతే అంతర్గతంగా మార్పులు చేయాలని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. డిజైన్లు మారిస్తే మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 

(4 / 6)

హైకోర్టు, సచివాలయం నిర్మాణాల పునాదులు ఇప్పటికే పూర్తయినందున...వీటి డిజైన్లు మార్చాలనుకోవడం సరికాదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. హైకోర్టు భవన డిజైన్ కు  సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులతో ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు భేటీ అయ్యి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

(5 / 6)

ఐకానిక్‌ భవనాల డిజైన్లకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ఆర్కిటెక్ట్‌ నియామకానికి సీఆర్‌డీఏ ఇటీవల టెండర్లు పిలిచింది. మరో మూడు, నాలుగు రోజుల్లో బిడ్ లు తెరిచి ఆర్కిటెక్ట్ ను ఖరారు చేయనున్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కూడా బిడ్‌ ను దాఖలు చేసింది. హైకోర్టు, సచివాలయ భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని ఐఐటీ చెన్నై నిపుణులు సర్టిఫై చేసిన విషయం తెలిసిందే. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు