Sai Pallavi: రెండేళ్ల తర్వాత బయోపిక్‌తో వస్తున్న సాయి పల్లవి.. అమరన్ మూవీ విశేషాలు
Sai Pallavi in Amaran Movie: గార్గి మూవీ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి.. దాదాపు రెండేళ్ల తర్వాత అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అక్టోబరులో రిలీజ్‌కానుంది.
(1 / 10)
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతోంది. శివ కార్తికేయన్ హీరోగా చేసిన అమరన్ మూవీ విడుదలకి సిద్ధమవుతుండగా.. అందులో శివ కార్తికేయన్ భార్యగా సాయి పల్లవి నటించింది. (saipallavi.senthamarai/Instagram)
(2 / 10)
ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఈ అమరన్. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా..మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించాడు. అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్‌గా క్యారెక్టర్ సాయిపల్లవి నటించింది. (saipallavi.senthamarai/Instagram)
(3 / 10)
సాయి పల్లవి నటిస్తున్న తొలి బయోపిక్ ఇది. దాంతో అమరన్ మూవీలో నటించే ముందే రెబెకాను కలిసిన సాయి పల్లవి కొన్ని రోజులు ఆమెతో ట్రావెల్ చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. (saipallavi.senthamarai/Instagram)
(4 / 10)
ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ గురించి శివ్ అరూర్, రాహుల్ సింగ్ గొప్పగా రాశారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అందులోని అంశాలను తీసుకుని కథ రాసుకున్నారు.(saipallavi.senthamarai/Instagram)
(5 / 10)
అక్టోబరు 31న అమరన్ మూవీ రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళంలోనే కాదు హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. (saipallavi.senthamarai/Instagram)
(6 / 10)
ప్రేమమ్, ఫిదా మూవీస్‌తో కుర్రకారుల మనసుదోచిన సాయి పల్లవి.. ఇప్పుడు సౌత్‌లోని అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. హిందీలో కూడా రామాయణంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. (saipallavi.senthamarai/Instagram)
(7 / 10)
నాగచైతన్యతో తండేల్‌లో సాయి పల్లవి నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మత్య్సకారుడిగా నాగచైతన్య కనిపించనుండగా.. సత్యగా సాయిపల్లవి నటిస్తోంది. (saipallavi.senthamarai/Instagram)
(8 / 10)
రెండేళ్ల క్రితం గార్గి సినిమాలో మెరిసిన సాయి పల్లవి.. కెరీర్‌లో కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. (saipallavi.senthamarai/Instagram)
(9 / 10)
సాయి పల్లవి ఇటీవల దగ్గరుండి మరీ తన చెల్లి పూజా కన్నన్ పెళ్లి చేసింది. ఆమె పెళ్లిలో వేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. చెల్లి పెళ్లి అయిపోవడంతో సాయి పల్లవి పెళ్లి గురించి నెటిజన్లు కొన్ని రోజులు చర్చించారు.(saipallavi.senthamarai/Instagram)
ఇతర గ్యాలరీలు