తెలుగు న్యూస్ / ఫోటో /
DA to central staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎంత ఉండబోతోంది?
DA to central staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ఈ వారంలోనే కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. డీఎ పెంపు ఎంత ఉండబోతోంది?
(1 / 5)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి నాలుగు శాతం డీఏ పెంపు ఉండవచ్చని సమాచారం. ఇది జూలై 2023 నుండి అమలులోకి రావచ్చని తెలుస్తోంది. 4% డీఎ పెంచితే, మొత్తం డీఏ 46 శాతానికి పెరుగుతుంది.
(2 / 5)
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42% డీఏ లభిస్తోంది. ఒకవేళ 4% డీఏ పెంచితే అది 46 శాతానికి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ను ప్రకటిస్తారు.
(3 / 5)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ ‘బేసిక్ పే’ రూ.18,000 అనుకుందాం. 42 శాతం డీఏ ఆధారంగా, వారు ప్రస్తుతం నెలకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 7,560 పొందుతున్నారు. డీఏ మొత్తం 46 శాతానికి పెరిగితే, వారికి డియర్‌నెస్ అలవెన్స్‌గా నెలకు రూ. 8,280 లభిస్తుంది.
(4 / 5)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలకు పెంచిన డీఏ శాతం ప్రకారం రూ. 720 అధికంగా పొందినట్లయితే, ఆ మొత్తం సంవత్సరానికి రూ. 8,640 అవుతుంది. ప్రతీ సంవత్సరం రెండుసార్లు డీఏ ను సవరిస్తారు.
ఇతర గ్యాలరీలు