ITBP Recruitment 2022 : 40 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ITBP Recruitment 2022 : ITBP రిక్రూట్‌మెంట్ 2022లో భాగంగా 40 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు recruitment.itbpolice.nic.inలో అప్లై చేయవచ్చు. అయితే అప్లై చేయడానికి జీతం, చివరి తేదీ, అర్హతలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ITBP Recruitment 2022 : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 17, 2022, రాత్రి 11:59 వరకు ఉంది. ఈ ITBP రిక్రూట్‌మెంట్ డ్రైవ్ హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) గ్రూప్ సి పోస్టు కోసం మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తుంది.
ITBP రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీల వివరాలు
* హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) : 40 పోస్టులు
* ITBP హెడ్ కానిస్టేబుల్ అర్హత ప్రమాణాలు : అభ్యర్థి 12వ తరగతి చదివి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా రెగ్యులర్ పారా వెటర్నరీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా వెటర్నరీ థెరప్యూటిక్ లేదా లైవ్‌స్టాక్‌కు సంబంధించి కనీసం ఒక సంవత్సరం వ్యవధి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
* ITBP రిక్రూట్‌మెంట్ 2022 ముఖ్యమైన తేదీలను ఇక్కడ చూడండి
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 19, 2022
* ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు : నవంబర్ 17, 2022
* ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ ఫేజ్ 1- PET/PST, ఫేజ్ 2- రాత పరీక్ష, ఫేజ్ 3- డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్