Karnataka hijab news : 'హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తాము- మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి..'-will lift hijab ban in karnataka says cm siddaramaiah ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Hijab News : 'హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తాము- మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి..'

Karnataka hijab news : 'హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తాము- మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి..'

Sharath Chitturi HT Telugu
Dec 23, 2023 06:18 AM IST

Karnataka hijab news ban : హిజాబ్​పై నిషేధం మీద కీలక ప్రకటన చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.

హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తాము..'
హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తాము..' (REUTERS)

Karnataka hijab news : కర్ణాటకలో హిజాబ్​పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ప్రజలకు ఉందని ఉద్ఘాటించారు.

'మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి..'

కర్ణాటకలో హిజాబ్​ చుట్టూ తిరిగిన వివాదం గురించి తెలిసిందే! 2022లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యాసంస్థల్లో హిజాబ్​ వేసుకోవడాన్ని నిషేధిస్తూ.. అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రకంపనలే సృష్టించింది. హిజాబ్​పై నిషేధానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. అయితే.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు. కచ్చితంగా హిజాబ్​ వేసుకోవాలి, ఇస్లాం మతంలో లేదని.. విద్యాసంస్థలు విద్యార్థుల డ్రెస్​ కోడ్​ని నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరుకూ వెళ్లింది. ద్విసభ్య ధర్మాసనం నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యూనిఫామ్​ని నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉందని ఒక జడ్జి అభిప్రాయపడగా.. హిజాబ్​ వేసుకోవాలా? వద్దా? అనేది ఛాయిస్​ అని మరో న్యాయమూర్తి పేర్కొన్నారు.

Hijab ban lifted in Karnataka : ఏది ఏమైనా.. 2022 నుంచి కర్ణాటకలో హిజాబ్​పై నిషేధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా.. మైసూర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య హిజాబ్​పై నిషేధం మీద కీలక ప్రకటన చేశారు.

"మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. మీకు నచ్చిన ఆహారం తినండి. నాకు నచ్చింది నేను తింటాను. నేను ధోతీ వేసుకుంటాను. మీరు ప్యాంటు- షర్టు వేసుకోండి. ఇందులో తప్పేముంది? అందుకే హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాము. మహిళలు హిజాబ్​ వేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు చెప్పాను. మహిళలు.. వారికి నచ్చిన దస్తులు వేసుకోవచ్చు," అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

Hijab ban in Karnataka : ఈ హిజాబ్​ వ్యవహారంపై కాంగ్రెస్​ పార్టీ ఆది నుంచే వ్యతిరేకంగా ఉంది. అవసరమైతే నిషేధాన్ని తొలగిస్తామని.. 2023 మేలో అధికారాన్ని చేపట్టిన తర్వాత వెల్లడించింది.

Whats_app_banner

సంబంధిత కథనం