Karnataka hijab ban: కర్నాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
Karnataka hijab ban: విద్యా సంస్థల్లో హిజాబ్ ను ధరించడంపై కర్నాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.
Karnataka hijab ban: విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీశాయి. హిజాబ్ ను ధరించడం తమ హక్కు అని, అది తమ మత సంప్రదాయమని ముస్లిం విద్యార్థినులు తమ విద్యా సంస్థల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హిజాబ్ తో కాలేజీలకు రావడాన్ని అడ్డుకున్నందుకు కొందరు విద్యార్థినులు పరీక్షలను కూడా బహిష్కరించారు.
Karnataka hijab ban: సుప్రీంకోర్టు లో కేసు
ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు మొదట కర్నాటక హైకోర్టులో దాఖలయ్యాయి. అయితే, హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది. దాంతో, హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై పలు దఫాలుగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కర్నాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల స్పందన తీసుకుంది. రాజ్యాంగబద్ధ విధుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Karnataka hijab ban: రిజర్వులో తీర్పు
వాద, ప్రతివాదనలు ముగిసిన తరువాత, ఈ కేసులో తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియా ల సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది.