Mamata Banerjee: మమత బెనర్జీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్-wb cm mamata banerjees chopper makes emergency landing due to inclement weather ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mamata Banerjee: మమత బెనర్జీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mamata Banerjee: మమత బెనర్జీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 07:20 PM IST

Mamata Banerjee’s chopper makes emergency landing: పశ్చిమబెంగాల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణం సాగకపోవడంతో పైలట్ ఆ చాపర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

Mamata Banerjee news: పశ్చిమబెంగాల్ లో మమత బెనర్జీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రతికూల వాతావరణ పరస్థితుల్లో ప్రయాణం సాగకపోవడంతో పైలట్ ఆ చాపర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో..

పశ్చిమ బెంగాల్ లో పంచాయితి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ముమ్మరంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే మంగళవారం జలపాయిగురి జిల్లాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం తిరుగుప్రయాణమయ్యారు. జల్పాయి గురి నుంచి హెలీకాప్టర్ లో బాగ్డోగ్రా కు తిరిగివస్తుండగా, వాతావరణం ఒక్క సారిగా మారింది. ఆ ప్రతికూల వాతావరణంలో ప్రయాణం సాధ్యం కాకపోవడంతో మధ్యాహ్నం సమయంలో సిలిగురి సమీపంలోని సెవొకె ఎయిర్ బేస్ లో ఆ హెలీకాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో చాపర్ కొద్దిగా ఒడిదుడుకులకు లోనవడంతో, మమత బెనర్జీకి స్వల్ప గాయాలయ్యాయని మొదట వార్తలు వచ్చాయి. అయితే, హెలీకాప్టర్ ల్యాండింగ్ సేఫ్ గా జరిగిందని, మమత బెనర్జీ సహా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. అనంతరం, మమత బెనర్జీ రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా కు వెళ్లారు. అక్కడి నుంచి కోల్ కతాకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.

పిడుగు పడడంతో..

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మమత బెనర్జీ చాపర్ లో ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచే భారీ వర్షం పడుతోంది. హెలీకాప్టర్ వైకుంఠాపూర్ అటవీ ప్రాంతంపై ఉండగా, చాపర్ కు అత్యంత సమీపంలో పిడుగు పడింది. దాంతో, పైలట్ వెంటనే ముందు జాగ్రత్తగా చాపర్ ను ల్యాండ్ చేయాలని నిర్ణయించుకుని, సిలిగురి సమీపంలోని సెవొకె ఎయిర్ బేస్ లో ఆ హెలీకాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ లో జులై 8 న పంచాయితి ఎన్నికలు జరగనున్నాయి.

IPL_Entry_Point