Mini Cooper world record : చిన్న కారులో 27మంది ఎక్కేశారు- ఇదొక వరల్డ్​ రికార్డ్​!-watch mini cooper world record with 27 people sitting in it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Watch Mini Cooper World Record With 27 People Sitting In It

Mini Cooper world record : చిన్న కారులో 27మంది ఎక్కేశారు- ఇదొక వరల్డ్​ రికార్డ్​!

Sharath Chitturi HT Telugu
Sep 11, 2022 10:10 PM IST

Mini Cooper world record : బీఎండబ్ల్యూకి చెందిన మినీ కూపర్​లో ఏకంగా 27మంది ఎక్కేశారు. ఇదొక వరల్డ్​ రికార్డ్​! ఈ వీడియోను మీరూ చూసేయండి.

చిన్న కారులో 27మంది ఎక్కేశారు- ఇదొక వరల్డ్​ రికార్డ్​
చిన్న కారులో 27మంది ఎక్కేశారు- ఇదొక వరల్డ్​ రికార్డ్​ (twitter)

Mini Cooper world record : ఒక చిన్న కారులో ఎంత మంది పడతారు? మహా అయితే.. ఐదుగురు. ఇంకొంచెం ఇరుకుగా కూర్చుంటే ఆరుగురు. కానీ బీఎండబ్ల్యూ మినీ కూపర్​లో ఏకంగా 27మంది పట్టేశారు! ఇప్పుడు ఇదొక రికార్డు!

ట్రెండింగ్ వార్తలు

మినీ కూపర్​.. వరల్డ్​ రికార్డ్​..!

మినీ కూపర్​కు సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసింది గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​. "రెగ్యులర్​ సైజులో ఉండే ఈ మినీ కూపర్​లో ఎంత మంది పడతారు?" అని రాసుకొచ్చింది.

ఈ వీడియో చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు. 27మంది.. చిన్న సైజులో ఉండే మినీ కూపర్​లో పట్టడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ వీడియోను ఈ నెల 6న.. తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​. కానీ ఈ వీడియో 2014 నాటిది. ఏనిమిదేళ్ల క్రితం ఈ వీడియో తీశారు. వివిధ టెక్నిక్స్​ వాడి.. 27మందిని మినీ కూపర్​లో పట్టించారు. ఇప్పటికీ ఈ రికార్డ్​ మినీ కూపర్​ పేరు మీదే ఉందని తెలుస్తోంది.

మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వైరల్​ వీడియోలో.. ఒక్కొక్కరు వరుసగా మినీ కూపర్​లోకి ఎక్కుతుండటం కనిపిస్తోంది. ఒకరికి ఒకరు సాయం చేసుకుని.. ఏకంగా 27మంది మినీ కూపర్​ను ఎక్కేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు వావ్​ అంటుంటే.. మరి కొందరు కన్ఫ్యూజన్​కు గురవుతున్నారు.

Mini Cooper viral video : "అంతా బాగానే ఉంది. ఫన్నీగా కూడా ఉంది. కానీ ఎవరైనా తమ కాలితో మరొకరి తలని కొడితే?" అని ఓ వ్యక్తి రాసుకొచ్చారు. 'ఫన్నీగానే ఉంది. కానీ ఎవరైనా పిత్తితే?' అని మరో వ్యక్తి డౌట్​ వ్యక్తం చేశాడు. "ఇదేం రికార్డ్​. దీనితో ప్రయోజనం ఏముంది? అసలు అవసరమా?" అని ఇంకో నెటిజన్​ ప్రశ్నించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

Mini Cooper price in India : మినీని 1996లో కొనుగోలు చేసింది బీఎండబ్ల్యూ. మినీ కారు కనిష్ఠ ధర రూ. 40లక్షలు. గరిష్ఠ ధర రూ. 50.90లక్షలుగా ఉంది. ఇండియాలో 5 మోడల్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నాలుగు హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​.

IPL_Entry_Point

సంబంధిత కథనం