The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’పై రాజకీయ దుమారం.. వివాదానికి కారణం ఏంటి?
The Kerala Story : ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కేరళలో అధికార, విపక్ష పార్టీలు సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మాత్రం మద్దతిస్తోంది. అసలేంటి వివాదం?
The Kerala Story controversy : మే 5న విడుదలకానున్న 'ది కేరళ స్టోరీ'పై తీవ్ర రాజకీయ దుమారం నెలకొంది. ఈ సినిమాపై కేరళలోని అధికార ఎల్డీఎఫ్, విపక్షాలు యూడీఎఫ్- కాంగ్రెస్‌లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సినిమాను నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అసలేంటి ఈ సినిమా? రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ది కేరళ స్టోరీ.. వివాదం..
ఐఎస్‌లో చేరి సిరియా, అఫ్గానిస్థాన్‌కు వెళ్లే విధంగా వేలాది మంది ముస్లిం మహిళలను ఏ విధంగా బ్రెయిన్‌వాష్ చేశారు అన్న అంశంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది.
The Kerala Story row : సినిమా బృందంపై సీపీఐ(ఎం)తో పాటు కాంగ్రెస్ మండిపడ్డాయి. సినీ బృందం.. సంఘ్ పరివార్ చేసే ప్రచారాలను ప్రోత్సహిస్తూ, కేరళలో మత తీవ్రవాదాన్ని పెంచుతోందని ఆరోపించాయి. రాష్ట్రంలో మతసామరస్యాన్ని నాశనం చేసేందుకు, సమాజంలో విషాన్ని చిమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు సీఎం పినరయి విజయన్.
సీఎం, కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. వివాదాస్పద చిత్రానికి మద్దతిచ్చింది.
The Kerala Story release date : ది కేరళ స్టోరీ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. "సినిమాను నిషేధించాలని నేను చెప్పను. భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగించినంత మాత్రాన అది విలువలేకుండా పోదు. కానీ ఇది వాస్తవానికి చాలా దూరంలో ఉందని మాట్లాడే హక్కు ప్రతి కేరళవాసికి ఉంది," అని వ్యాఖ్యానించారు.
వివాదం నేపథ్యంలో సినిమాను థియేటర్లలో నిషేధించి ఉపయోగం లేదని, ఓటీటీలో ప్రేక్షకులు ఎలాగో చూస్తారని ఎఫ్ఈయూఓకే (ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ) అభిప్రాయపడింది. కానీ ఇలాంటి సినిమాలు చెడ్డ ఉదాహరణలుగా మిగిలిపోతాయని ఎఫ్ఈయూఓకే ఆఫీస్ బేరర్ సురేశ షెనోయ్ అభిప్రాయపడ్డారు.
Adah Sharma The Kerala Story : కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్ లీగ్ మరో అడుగు ముందుకేసింది. ది కేరళ స్టోరీలో ఆరోపిస్తున్న వాటిని సాక్ష్యాలతో సహా నిరూపించిన వారికి రూ. 1కోటి రివార్డు ఇస్తామని ప్రకటించింది.
మరోవైపు.. 'ఐఎస్‌లో చేరేందుకు కేరళ నుంచి ఒక్కరు కూడా సిరియాకు వెళ్లలేదని నిరూపించిన వారికి నేను రూ. 10కోట్లు రివార్డు ఇస్తా' అని ప్రకటించారు హిందూ సేవా కేంద్రాకు చెందిన ప్రతీశ్ విశ్వనాత్.
The Kerala Story latest news : ప్రముఖ నటి అదా శర్మ నటిస్తున్న ది కేరళ స్టోరీని సన్‌షైన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. ఈ సినిమాకు విపుల్ అమృత్లాల్ షా.. నిర్మాత, క్రియేటివ్ డైరక్టర్, కో-రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్ర రచయిత సుదిప్తో సేన్.. గతంలో ఆస్మా, ది లక్నో టైమ్స్, ది లాస్ట్ మాంక్ వంటి చిత్రాలకు పనిచేశారు.
సంబంధిత కథనం