Putin girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌తో సీక్రెట్‌గా ఎంజాయ్ చేస్తున్న పుతిన్.. ఆ ప్యాలెస్‌లో..!
Vladimir Putin girlfriend : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడెక్కడున్నారు? అన్న ప్రశ్నకు ఓ నివేదిక సమాధానం చెప్పింది. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పుతిన్..ఓ ప్యాలెస్‌లో ఉన్నట్టు పేర్కొంది.
Vladimir Putin girlfriend : ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా పుతిన్‌కు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. తన గర్ల్‌ఫ్రెండ్, పిల్లలతో కలిసి పుతిన్.. మాస్కోకు సమీపంలోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో గడుపుతున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. రష్యా బడ్జెట్ నిధుల నుంచి అక్రమంగా డబ్బులు తరలించి ఈ ప్యాలెస్‌ను నిర్మించినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి.
గర్ల్‌ఫ్రెండ్‌తో.. ప్యాలెస్‌లో..
39ఏళ్ల జిమ్నాస్ట్ అలినా కబేవాతో పుతిన్ రిలేషన్లో ఉన్నట్టు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. వీరిద్దరు మాస్కోకు వాయువ్యంవైపు ఉన్న లేక్ వాల్దైకు సమీపంలోని ఓ ఎస్టేట్‌లో ఉంటున్నట్టు రష్యన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ సైట్ 'ది ప్రాజెక్ట్' వెల్లడించింది.
Vladimir Putin latest news : 120 మిలియన్ డాలర్లు వెచ్చించి, ఈ ఎస్టేట్‌ను రెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు పుతిన్. నిర్మాణ పనులు 2020లో మొదలై.. రెండేళ్లల్లో ముగిశాయి. ఆ తర్వాత, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పుతిన్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఎస్టేట్.. 13వేల చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించారు. గతంలో బయటకొచ్చిన ఫొటోల ప్రకారం.. ఈ ఎస్టేట్‌లో బంగారంతో తయారు చేసిన కుర్చీలు, టేబుల్స్ వంటి వస్తువులు ఉన్నాయి.
ప్యాలెస్‌లో అలినా కబేవాతో పాటు కొందరు పిల్లలను కూడా చూసినట్టు ఓ అధికారి చెప్పారని నివేదిక పేర్కొంది. అలినాకు చెందిన మహిళా బంధువులు కూడా ఎస్టేట్‌లో ఉన్నట్టు వివరించింది. పుతిన్, అలినాలు కలిసి ఉండటం తాము ఎప్పుడు చూడలేదని పలువురు అధికారులు పేర్కొన్నారు. అలా అని వారిద్దరు రిలేషన్లో లేరని కాదు అని వివరించారు.
బడ్జెట్ డబ్బులతో..!
Russia Ukraine war : 2014లో రష్యా జాతీయ మీడియా బృందం బాధ్యతలను అలినాకు అప్పగించారు పుతిన్. అప్పటి నుంచి ఆమెకు ప్రతియేటా 8.6 మిలియన్ యూరోలు జీతంగా అందుతున్నాయి!
వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి, ప్రస్తుతం జైలులో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీ బృందం.. 2021లో తొలిసారి ఈ ఎస్టేట్ వివరాలను బయటపెట్టింది. బడ్జెట్ నిధులను దొంగలించి, ఈ ఎస్టేట్‌కు నిర్మించారని నావెల్నీ బృందం ఆరోపించింది.