పట్టపగలు ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని ముంబై రోడ్లపై యువతి చక్కర్లు; వీడియో వైరల్-viral video mumbai model walks in towel under broad daylight netizens react ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పట్టపగలు ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని ముంబై రోడ్లపై యువతి చక్కర్లు; వీడియో వైరల్

పట్టపగలు ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని ముంబై రోడ్లపై యువతి చక్కర్లు; వీడియో వైరల్

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 04:01 PM IST

ముంబైలో ఒక యువతి ఒక టవల్ మాత్రమే చుట్టుకుని రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.డిజిటల్ క్రియేటర్, మింత్రా ఫ్యాషన్ సూపర్ స్టార్ విన్నర్ తనుమితా ఘోష్ కు సంబంధించిన ఆ వీడియో పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని ముంబై రోడ్లపై యువతి చక్కర్లు
ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని ముంబై రోడ్లపై యువతి చక్కర్లు

ముంబై వీధిలో ఓ యువతి టవల్ ధరించి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజిటల్ క్రియేటర్, మింత్రా ఫ్యాషన్ సూపర్ స్టార్ విన్నర్ తనుమితా ఘోష్ ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో పింక్ టవల్ ధరించి నడుస్తున్న వీడియో ఇది. ఘోష్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆ వీడియోలో, ఆమె బస్ స్టాప్ నుండి సమీపంలోని హోటల్ కు నడుచుకుంటూ వెళ్తంది. అలాగే అక్కడ ఉన్న బెంచీపై కూర్చుంటుంది. అక్కడి ప్రజలు ఆమెను ఆసక్తిగా చూస్తుండడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఆ తరువాత ఆ టవల్ తీసి..

ఆ తరువాత, ఆమె ఆ హోటల్ ముందు నడుస్తూ అకస్మాత్తుగా తన జుట్టును కప్పి ఉంచే టవల్ ను, ఆ పై తన శరీరానికి చుట్టుకున్న టవల్ ను నాటకీయంగా తీసి, కింద తాను ధరించిన అందమైన నియాన్ ఎల్లో డ్రెస్ ను ఆవిష్కరించి చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో ఇటీవలిది కాదని, పాత వీడియో అని తనుమితా ఘోష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 'ముంబై ప్రజలు నన్ను చూసి #TaubaTauba అనుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకోండి' అని ఆమె తన పోస్ట్ లో కామెంట్ పెట్టారు.

ఇన్ స్టాలో వివరణ

ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను 13,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్ల స్పదన మిశ్రమంగా ఉంది. ఆమె బోల్డ్ ప్రాంక్ ను కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు సమర్ధిస్తూ పోస్ట్ లు పెడ్తున్నారు. అయితే, ఈ వీడియో 2019 నాటి ఒక షో కు సంబంధించిన ఒక టాస్క్ లో భాగమని తనుమితా ఘోష్ వివరించారు. "గయ్స్, ఈ వీడియో 2019 లో చిత్రీకరించిన షోలో భాగం. ఒక టాస్క్ లో భాగం. సోనాక్షి సిన్హా, షలీనా నథానీ, మనీష్ మల్హోత్రా, డినో మోరియా తదితరులు ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇది ఒక ఎపిసోడ్ లో టాస్క్ కాబట్టి దయచేసి అంత సీరియస్ గా తీసుకోకండి! థ్యాంక్యూ' అని తనుమితా ఘోష్ రాసుకొచ్చారు.

వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన

ఈ వీడియోపై ఒక యూజర్ "ఉర్ఫీ జావేద్ కీ ఛోటీ బెహెన్" అని కామెంట్ చేశాడు. మీరు జాకెట్ స్టైల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది అని మరో యూజర్ స్పందించాడు. 'దీదీ యే హాలీవుడ్ కే చింక్స్ యాహ నహీ చల్తే' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘గట్స్ అండ్ ది బెస్ట్ వాలా గట్స్ " అని మరో యూజర్ రాశాడు. ‘బాగుంది కానీ మళ్లీ ప్రయత్నించకండి" అని ఒక యూజర్ సలహా ఇచ్చాడు. "తౌబా తౌబా పూరా మూడ్ ఖరాబ్ కర్ దియా" అని మరొకరు ఫన్నీగా స్పందించారు.