ఢిల్లీ కొత్త ఎల్జీగా వినయ్​ కుమార్​ సక్సేనా నియామకం-vinai kumar saxena becomes new lieutenant governor of delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఢిల్లీ కొత్త ఎల్జీగా వినయ్​ కుమార్​ సక్సేనా నియామకం

ఢిల్లీ కొత్త ఎల్జీగా వినయ్​ కుమార్​ సక్సేనా నియామకం

HT Telugu Desk HT Telugu
May 23, 2022 09:24 PM IST

ఢిల్లీ ఎల్జీ పదవికి అనిల్​ బైజాల్​ రాజీనామా చేయగా.. ఆ బాధ్యతలను వినయ్​ కుమార్​ సక్సేనాకు అప్పగించారు. ఈ మేరకు సంబంధిత పత్రాలపై రాష్ట్రపతి సోమవారం సంతకాలు చేశారు.

<p>వినయ్​ కుమార్​ సక్సేనా</p>
వినయ్​ కుమార్​ సక్సేనా (Twitter)

ఢిల్లీ నూతన ఎల్జీగా వినయ్​ కుమార్​ సక్సేనా నియమితులయ్యారు. మాజీ లెఫ్టినెంటర్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​.. వినయ్​ కుమార్​ నియామకానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. త్వరలో ఆయన ఎల్జీ పదవిని చేపట్టనున్నారు. ఈ మేరకు.. రాష్ట్రపతి భవన్​ సోమవారం రాత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది.

వ్యక్తిగత కారణాలతో ఎల్జీ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు.. మాజీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ ప్రకటించిన కొన్ని రోజుల అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

ఎల్జీ పదవి చేపట్టే ముందు వరకు.. వినయ్​ కుమార్​ సక్సేనా.. ఖాదీ అండ్​ విలేజ్​ ఇండస్ట్రీస్​ కమిషన్​ ఛైర్మన్​గా వ్యవహరించారు.

2016 డిసెంబర్​లో ఢిల్లీ ఎల్జీగా పదవి చేపట్టారు అనిల్​ బైజాల్​. అప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం- ఎల్జీ కార్యాలయం మధ్య వివాదాలు నిత్యం వార్తల్లో నిలిచేవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎల్జీని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై కుట్రలు పన్నుతోందని అధికార ఆమ్​ ఆద్మీ ఆరోపిస్తూ వచ్చింది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎల్జీ పదవులపై మరింత స్పష్టతనిస్తూ.. 2018లో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పును వెలువరించింది.

‘ఎల్జీకి ప్ర‌త్యేక‌మైన అధికారాలు, స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకునే అధికారం లేదు. ఆ అధికారాలు ఎన్నికైన ప్ర‌భుత్వానికే ఉంటాయి,’ అని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీతో, ఆ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌తో ఎల్జీ అనిల్ బైజాల్‌కి ఎన్న‌డూ స‌త్సంబంధాలు లేవు.

Whats_app_banner

సంబంధిత కథనం