New labour code : జులై 1 నుంచి మీ ‘టేక్​-హోం’ శాలరీ తగ్గిపోతుంది.. ఎందుకంటే!-under new labour code salary working hours could change ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Labour Code : జులై 1 నుంచి మీ ‘టేక్​-హోం’ శాలరీ తగ్గిపోతుంది.. ఎందుకంటే!

New labour code : జులై 1 నుంచి మీ ‘టేక్​-హోం’ శాలరీ తగ్గిపోతుంది.. ఎందుకంటే!

Sharath Chitturi HT Telugu
Jun 28, 2022 01:47 PM IST

New labour code : కొత్త లేబర్​ కోడ్​ను అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. అది అమల్లోకి వస్తే మీ టేక్​-హోం శాలరీ తగ్గిపోతుంది. ఎందుకంటే..!

జులై 1 నుంచి మీ టేక్​-హోం శాలరీ తగ్గిపోతుంది!
జులై 1 నుంచి మీ టేక్​-హోం శాలరీ తగ్గిపోతుంది! (HT)

New labour code : కొత్త లేబర్​ కోడ్​తో దేశంలో భారీ మార్పులు జరగనున్నాయి! ముఖ్యంగా ఉద్యోగుల జీతాలపై ఇది ప్రభావం చూపించనుంది. ఈ మేరకు సంబంధించిన నిబంధనలను మినిస్ట్రీ ఆఫ్​ లేబర్​ అండ్​ ఎంప్లాయిమెంట్​.. ఫిక్స్​ చేసింది. కొత్త లేబర్​ కోడ్​ అమల్లోకి వస్తే వచ్చే మార్పులు ఇవే..

పని గంటలు..

కొత్త లేబర్​ కోడ్​తో పని వేళల్లో మార్పులు జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9గంటల పాటు వర్కింగ్​ హవర్​ ఉంది. కాగా.. కంపెనీలు ఇప్పుడు దానిని 12గంటలకు పెంచుకోవచ్చు. ఒకవేళ అదే చేస్తే.. ఉద్యోగులకు వారంలో మూడు రోజుల పాటు కచ్చితంగా సెలవులు ఇవ్వాలి. అంటే వారంలో నాలుగు రోజులు మాత్రమే పని ఉంటుంది.

ఇలా చేస్తే.. వారంలో 48గంటల పాటు పనిచేయాలన్న నిబంధనలో మార్పులు ఉండవు.

సెలవులు..

New labour law 2022 : సెలవులు తీసుకోవాలంటే.. ఏడాదిలో 240 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇక కొత్త లేబర్​ కోడ్​ అమల్లోకి వస్తే.. అది 180 రోజులకు దిగొస్తుంది.

టేక్​-హోం శాలరీ..

కొత్త లేబర్​ కోడ్​తో ఉద్యోగుల టేక్​ హోం శాలరీ తగ్గిపోతుంది! పీఎఫ్​ కాంట్రిబ్యూషన్​.. గ్రాస్​ పేలో 50శాతంగా ఉండాలని నిబంధన పెట్టడమే ఇందుకు కారణం.

ఈ నాలుగు కోడ్స్​ను పార్లమెంట్​ ఆమోదించింది. వేతనాలు, పరిశ్రమ సంబంధాలు, సామాజిక భద్రత- ఆరోగ్య భద్రత, పని ప్రదేశాల్లో వేసులబాట్లపై ఈ కోడ్స్​ను రూపొందించింది కేంద్రం. వీటన్నింటిని ఒకేసారి అమలు చేద్దామని కేంద్రం యోచిస్తోంది. జులై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్